మినీ ఆఫ్రికా@ టోలిచౌకీ..! | Hyderabad Tolichawki Paramount Colony adjacent to resembles mini Africa | Sakshi
Sakshi News home page

మినీ ఆఫ్రికా @ టోలిచౌకీ..! అంతా సూడాన్, సొమాలియా వాసులే..

May 9 2025 9:26 AM | Updated on May 9 2025 9:26 AM

Hyderabad Tolichawki Paramount Colony adjacent to resembles mini Africa

టోలిచౌకీని ఆనుకుని ఉన్న పారామౌంట్‌ కాలనీ మినీ ఆఫ్రికాను తలపిస్తుంది. అధునాతన నివాస గృహాలు ఎత్తయిన ప్రదేశంలో ఉన్న ఈ కాలనీ ప్రస్తుతం సూడాన్, సొమాలియా వాసుల అడ్డాగా పేరుగాంచింది. ఇక్కడ ఉంటున్న వారిలో 90 శాతం మంది మినీ ఆఫ్రీకాకు చెందిన వారే. ప్రశాంత వాతావరణంలో ఉండడంతో పాటు ఫిలింనగర్, జూబ్లీహిల్స్, టోలిచౌకీ చౌరస్తా తదితర ప్రదేశాలకు అత్యంత సమీపంలో ఉన్న పారామౌంట్‌ కాలనీ ఆఫ్రీకా దేశాలకు చెందిన విద్యార్థులకు అడ్డాగా నిలుస్తోంది. 

పదేళ్ల క్రితం స్థానికులతో నిండి ఉన్న ఈ కాలనీ నేడు ఆఫ్రికా దేశస్తులతో నిండివుంది. కొత్తగా నిర్మితమవుతున్న భవనాలను సైతం సూడాన్, సొమాలియా దేశాలకు చెందిన విద్యార్థులు అద్దెకు ముందుగానే బుక్‌ చేసుకుంటున్నారు. గతంలో ఇక్కడ ఉన్న ఇరానీ రెస్టారెంట్లు, చిన్న చిన్న కిరాణా దుకాణాలు మాయమై వాటి స్థానంలో అత్యాధునిక ఆఫ్రికన్‌ కిచెన్‌లు వెలిశాయి.  

ఆఫ్రికన్‌ తరహా జీవనశైలి.. 
టీ సెంటర్లలో సైతం అరేబియన్‌ టీ అందుబాటులో ఉంటుంది. ఇక్కడి షాపులు ఆఫ్రికన్‌ దేశాల వారికి అవసరమయ్యేవే ఎక్కువగా లభిస్తున్నాయి. రేడీమేడ్‌ షాపుల్లో సైతం సూడాన్‌ యువకులు ఇష్టపడి తొడిగే టీషర్ట్స్‌ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. 

ఆఫ్రికన్‌ దేశాల నుంచి విద్యాబ్యాసం కోసం వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం పలు కారణాలతో ఇక్కడకు వస్తున్నారు. ఒక సూడానీస్‌తో  పాటు అదనంగా ఇద్దరు ముగ్గురు వారి కుటుంబ సభ్యులు ఒక్కొ ప్లాట్‌లో ఉంటున్నారు. దీంతో స్థానికులు, వ్యాపారులు సైతం నెమ్మదిగా ఇంగ్లిష్‌తో పాటు సూడానీస్, సొమాలియా భాషను నేర్చుకుంటున్నారు.   

(చదవండి: రేపటి నుంచే ‍ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ​ పోటీలు..!)

Advertisement
 
Advertisement
Advertisement