భారతదేశానికి చెందిన, ఎన్‌పీసీఐ ధృవీకృత టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ వియోనా ఫిన్‌టెక్ తన డిజిటల్ చెల్లింపుల టెక్నాలజీని ఆఫ్రికా దేశాలకు విస్తరించనుంది. జింబాబ్వేలో వియోనా ట్యాప్ అండ్ పే ప్లాట్‌ఫారాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ దిశగా జింబాబ్వే ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నట్లు సంస్థ తెలిపింది.
వియోనా ట్యాప్ అండ్ పే అనేది ఎన్‌ఎఫ్‌సీ ఆధారిత సాఫ్ట్‌పీఓఎస్. త్వరలో అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లనే కాంటాక్ట్‌లెస్ పీఓఎస్‌లుగా మార్చుకోవచ్చు. దీంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు ప్రత్యేకమైన పీఓఎస్ యంత్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది.
జింబాబ్వేలోనూ యూపీఐ ప్లాట్‌ఫారం ప్రవేశపెట్టేందకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే, ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) మధ్య చర్చల జరుగుతున్న నేపథ్యంలో వియోనా ఆఫ్రికాలో వ్యాపార విస్తరణ చేపట్టడం గమనార్హం.
భారతదేశంలో అభివృద్ధి చెందిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అనేక ఆఫ్రికా దేశాల్లోనూ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వ్యాపారుల చెల్లింపు స్వీకరణ మౌలిక సదుపాయాలను అందించడంపై వియోనా దృష్టి సారించింది. జింబాబ్వేలో స్థానిక అక్వైరింగ్ బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు (PSPs), వ్యాపార నెట్‌వర్క్‌లతో భాగస్వామ్య అవకాశాలను సంస్థ పరిశీలిస్తోంది.
ఆఫ్రికాలో డిజిటల్ ఫైనాన్స్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆఫ్రికానెండా స్టేట్ ఆఫ్ ఇన్‌క్లూజివ్ ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ఆఫ్రికా 2025 నివేదిక ప్రకారం, 2024లో ఆఫ్రికా దేశాల్లోని తక్షణ చెల్లింపు వ్యవస్థలు సుమారు రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన 64 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేశాయి. 2025 జూన్ నాటికి 31 దేశాల్లో 36 ఇన్‌స్టంట్ పేమెంట్ వ్యవస్థలు అమలులో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
ఎన్‌పీసీఐ ధృవీకృత భాగస్వామిగా వియోనాకు యూపీఐ అనుగుణ చెల్లింపు వ్యవస్థలను నిర్వహించడం, విస్తరించడం వంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు, అక్వైరింగ్ బ్యాంకులు, స్థానిక పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్‌ఐపీఎల్ మద్దతుతో పనిచేసే చెల్లింపు స్విచ్‌లకు నేరుగా అనుసంధానించగల వ్యాపార చెల్లింపు స్వీకరణ సాంకేతికతను అందించనున్నట్లు సంస్థ తెలిపింది.
జాతీయ చెల్లింపు వ్యవస్థలు క్లియరింగ్ ప్రక్రియను నిర్వహించినప్పటికీ, రోజువారీ వాణిజ్య లావాదేవీల విజయానికి వ్యాపారుల భాగస్వామ్యం కీలకమని వియోనా పేర్కొంది. ఈ నేపథ్యంలో, సాధారణ స్మార్ట్‌ఫోన్లనే డిజిటల్ చెల్లింపు టెర్మినల్స్‌గా మార్చే ట్యాప్ అండ్ పే ప్లాట్‌ఫారం సూక్ష్మ వ్యాపారులకు ప్రత్యేక పీఓఎస్ పరికరాల అవసరం లేకుండానే జాతీయ చెల్లింపు నెట్‌వర్క్‌లను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుందని వివరించింది.
భారతదేశంతో పాటు ఎంపిక చేసిన ఆఫ్రికా దేశాల్లో వియోనా ట్యాప్ అండ్ పే వాణిజ్య సేవల పూర్తి స్థాయి ప్రారంభం సంబంధిత చెల్లింపు నెట్‌వర్క్ సర్టిఫికేషన్లు, స్థానిక నియంత్రణ సంస్థల అనుమతులు పూర్తైన అనంతరం చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఇదీ చదవండి: ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. లాభాల వర్షం కురిపించిన EV స్టాక్!


