ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. లాభాల వర్షం కురిపించిన EV స్టాక్! | Ather Energy Shares Good Returns in A Year - Know The Target Price | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు గుడ్‌న్యూస్.. లాభాల వర్షం కురిపించిన EV స్టాక్!

Oct 12 2026 5:27 PM | Updated on Oct 12 2026 5:36 PM

Ather Energy Shares Good Returns in A Year - Know The Target Price

ఏథర్ ఎనర్జీ (Ather Energy) భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో గుర్తింపు పొందుతున్న సంస్థ. స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ అయిన సుమారు ఏడాదిన్నర కాలంలోనే.. ఈ కంపెనీ షేర్ ధర గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా.. గత ఏడాది కాలంలో దాదాపు 129.44% రాబడిని అందించడంతో, దలాల్ స్ట్రీట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్‌గా గుర్తింపు పొందుతోంది. అంటే.. తక్కువ సమయంలో పెట్టుబడిదారులకు పెట్టుబడిపై గణనీయమైన లాభాలను అందించిన షేర్‌గా నిలుస్తోంది. అయితే, షేర్ ధర ఇప్పటికే భారీగా పెరిగినప్పటికీ, మరింత పెరిగే అవకాశం ఉందని కొందరు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

శుక్రవారం ఏథర్ ఎనర్జీ షేర్ బీఎస్‌ఈలో 2.01% లాభంతో ఒక్కో షేర్‌కు రూ.1,431.25 వద్ద ముగిసింది. వారమంతా షేర్ ధరలో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ.. చివరికి లాభాలతో ముగియడం గమనార్హం. గత ఆరు నెలల్లో ఈ షేర్ సుమారు 74% పెరిగింది. 2026లో ఇప్పటివరకు, అంటే.. ఏడాది ప్రారంభం నుంచి సుమారు 94% వృద్ధిని నమోదు చేసింది. ఈ గణాంకాలు చూస్తే, పెట్టుబడిదారుల్లో ఈ కంపెనీపై ఆసక్తి పెరిగినట్లు స్పష్టమవుతోంది.

ఈవీ రంగంలో పోటీ
ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం..మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో, చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సమయంలో.. ఈవీ రంగానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మార్కెట్‌లో ఈ విభాగంలో పోటీ కూడా ఎక్కువగానే ఉంది.

ఈ పరిస్థితుల్లో ఏథర్ ఎనర్జీ తన తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం, స్కూటర్ల తయారీ ఖర్చులను తగ్గించడం, బ్యాటరీ ఖర్చుల్లో ఆదా చేయడం ద్వారా లాభాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. కంపెనీ ఈ లక్ష్యాలను సాధించగలిగితే, భవిష్యత్తులో వ్యాపారం మరింత బలపడే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కంపెనీ రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షల ధరల శ్రేణిలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. ఇప్పటివరకు ప్రీమియం స్కూటర్లకు ఎక్కువగా గుర్తింపు పొందిన ఏథర్, తక్కువ ధరల విభాగంలోకి వస్తే మరింత మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు. దీనివల్ల అమ్మకాలు పెరిగి కంపెనీ వృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది.

పెట్టుబడిదారులకు సూచన
ఇక్కడే పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే.. ఒక షేర్ ఇప్పటికే ఏడాది కాలంలో 129% పెరిగిందంటే, అది భవిష్యత్తులో కూడా అదే వేగంతో పెరుగుతుందని చెప్పలేం. కంపెనీ అమ్మకాలు పెరుగుతున్నాయా, లాభాలు మెరుగుపడుతున్నాయా, కొత్త స్కూటర్లకు మార్కెట్‌లో ఆదరణ లభిస్తోందా అనే విషయాలను గమనించాలి. ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోయినా.. లేదా ఖర్చులు తగ్గకపోయినా.. షేర్ ధరపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఫ్రెషర్లైనా, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నా.. ఈ స్కిల్స్ ఉంటే ఉద్యోగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement