ఫ్రెషర్లైనా, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నా.. ఈ స్కిల్స్ ఉంటే ఉద్యోగం! | TCS Hiring Update 80 Percent Of New Employees Have Digital Skills As AI Expertise Creates More IT Job Opportunities | Sakshi
Sakshi News home page

ఫ్రెషర్లైనా, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నా.. ఈ స్కిల్స్ ఉంటే ఉద్యోగం!

Oct 12 2026 4:15 PM | Updated on Oct 12 2026 4:38 PM

TCS To Hire 80 Percent Freshers With These AI Skills

ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. కంపెనీలు కొత్త ఉద్యోగులను నియమించుకునే సమయంలో కూడా ఏఐ, డిజిటల్ టెక్నాలజీలపై అవగాహన ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నియామకాలే ఓ మంచి ఉదాహరణ.

డిగ్రీ ఉంటే సరిపోదు
టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరతి సుబ్రమణియన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కంపెనీ సుమారు 4,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. వీరిలో 25 నుంచి 30 శాతం మందికి ప్రత్యేకమైన ఏఐ నైపుణ్యాలు ఉండగా.. దాదాపు 80 శాతం మందికి ఆధునిక టెక్నాలజీలపై అవగాహన ఉంది. అంటే.. కంపెనీలు ఇప్పుడు ఉద్యోగులను తీసుకునేటప్పుడు కేవలం డిగ్రీలు, సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా.. కొత్త టెక్నాలజీలను ఉపయోగించి పనిచేయగల సామర్థ్యాన్ని కూడా చూస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితిలో ఫ్రెషర్లకు ఎక్కువ అవకాశాలు వస్తాయా?, లేక అనుభవం ఉన్న ఉద్యోగులకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందా? అనే ప్రశ్న చాలామందిలో ఉంది. కానీ.. ఎవరికైతే ఏఐ గురించి ఎక్కువ స్కిల్స్ తెలిసి ఉంటాయో.. వారికి తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అనుభవం ఉంటే మంచి అవకాశాలు
నిజానికి కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే వారికి ఏఐ టూల్స్ నేర్చుకోవడం కొంత సులభంగా ఉంటుంది. కానీ అనుభవం ఉన్న ఉద్యోగులు ఏఐ టూల్స్ నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయి. దీనిపై టీసీఎస్ సీఈఓ కే. కృతివాసన్ మాట్లాడుతూ.. కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న అనుభవజ్ఞులకు తమ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎందుకంటే.. వారికి ఇప్పటికే టెక్నాలజీపై అవగాహనతో పాటు, కస్టమర్ల అవసరాలు, వ్యాపార విధానాలు, సమస్యలను పరిష్కరించే పద్ధతుల గురించి కూడా తెలిసి ఉంటుంది. ఆ అనుభవానికి ఏఐ నైపుణ్యాలు తోడైతే వారు మరింత సమర్థవంతంగా పనిచేయగలరని అన్నారు.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏఐ టూల్స్ ఉపయోగించడం వచ్చినంత మాత్రాన ఉద్యోగానికి అవసరమైన అన్ని నైపుణ్యాలు ఉన్నట్లు కాదు. ఉదాహరణకు, చాట్‌జీపీటీ ఉపయోగించి కోడ్ రాయడం లేదా రిపోర్టులు తయారు చేయడం నేర్చుకోవచ్చు. కానీ ఆ కోడ్ సరిగ్గా పనిచేస్తుందా, రిపోర్టులోని సమాచారం నిజమా, ఆ ఫలితం కంపెనీ అవసరాలకు సరిపోతుందా అనే విషయాలను కూడా తెలుసుకోవాలి. ఏఐ ఇచ్చిన సమాధానాన్ని గుడ్డిగా నమ్మకుండా, దాన్ని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.

ఇదీ చదవండి: వెండి భారీ పతనం.. అసలు కారణం ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement