వెండి భారీ పతనం.. అసలు కారణం ఇదే! | Silver Prices Plunge 16% In 2026, Key Reasons Behind The Sharp Decline And What Investors Should Know | Sakshi
Sakshi News home page

వెండి భారీ పతనం.. అసలు కారణం ఇదే!

Oct 11 2026 6:52 PM | Updated on Oct 11 2026 7:35 PM

Silver Prices Crash and Why Rates Falling More Than Gold

సాధారణంగా బంగారం, వెండి అంటే చాలామందికి ఇష్టం. కొందరు ఆభరణాల కోసం కొనుగోలు చేస్తే.. మరికొందరు భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయనే ఆశతో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే, గత కొంతకాలంగా బంగారంతో పోలిస్తే వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. దీంతో వెండిలో పెట్టుబడి పెట్టినవారు ఆందోళన చెందుతున్నారు. గతంలో మంచి రాబడులు ఇచ్చిన వెండి ఇప్పుడు ఎందుకు తగ్గుతోంది? అసలు ధరల పతనానికి కారణాలేంటి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అందుకే వెండికి డిమాండ్
వెండిని మనం సాధారణంగా ఆభరణాలు, పూజా సామగ్రి, పట్టీలు, మెట్టెలు, దేవుడి విగ్రహాలు, గ్లాసులు వంటి వస్తువుల తయారీలో ఉపయోగిస్తుంటాం. అయితే.. వెండికి డిమాండ్ పెరగడానికి ఇవే ప్రధాన కారణాలు కావు. పారిశ్రామిక రంగంలో కూడా వెండిని విస్తృతంగా వినియోగించడంతో వెండికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ చిప్‌లు, డేటా సెంటర్లు వంటి రంగాల్లో వెండి కీలక పాత్ర పోషిస్తుంది.

వెండికి విద్యుత్‌ను సమర్థవంతంగా ప్రసారం చేసే లక్షణం ఉండటంతో అనేక ఎలక్ట్రానిక్ పరికరాల్లో దీన్ని ఉపయోగిస్తారు. అందువల్ల పారిశ్రామిక రంగంలో డిమాండ్ పెరిగినా, తగ్గినా వెండి ధరలపై ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలో జరిగే మార్పులు కూడా వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.

బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం
ఇటీవల బంగారం, వెండి ధరల మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం ధర సుమారు 3 శాతం తగ్గగా, వెండి ధర ఏకంగా 16 శాతం పడిపోయింది. గత ఆరు నెలల్లో వెండి 20.14 శాతం, గత నెలలో 8.14 శాతం తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

పరిశ్రమల్లో వెండి వినియోగం తగ్గితే.. భవిష్యత్తులో వెండికి డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుందని పెట్టుబడిదారుల్లో ఆందోళన కలుగుతోంది. అమెరికా డాలర్ బలపడటం కూడా వెండి ధరలను ప్రభావితం చేయవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి సాధారణంగా డాలర్లలో ట్రేడవుతుంది. డాలర్ బలపడినప్పుడు ఇతర కరెన్సీలు ఉపయోగించే కొనుగోలుదారులకు వెండి ఖరీదుగా మారే అవకాశం ఉంటుంది. దీంతో డిమాండ్‌పై ప్రభావం పడవచ్చు.

ఇదీ చదవండి: మరోసారి పెరగనున్న రీఛార్జ్ ధరలు.. ఈసారి ఎంతంటే?

ఈ రోజు వెండి ధరలు
వెండి రేటు గత వారం రోజులుగా స్థిరంగా ఉంది. దీంతో కేజీ సిల్వర్ ధర హైదరాబాద్, విజయవాడలలో రూ.2.45 లక్షల వద్ద ఉంది. ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.2.40 లక్షల వద్ద ఉంది.

వెండి ధరలు1
1/2

వెండి ధరలు2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement