
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ రొమ్ము కేన్సర్ అవగాహనకు అక్టోబర్ నెలను గుర్తిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ఉషలక్ష్మి బ్రెస్ట్ కేన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పెయింట్ ది సిటీ పింక్’ వార్షిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
దీనిలో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రసిద్ధ భవనాలను పింక్ లైటింగ్‌తో కాంతులీనేలా చేశారు. వీటిలో చార్మినార్, బుద్ధ విగ్రహం, టీ–హబ్, ప్రసాద్ ఐమ్యాక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, కిమ్స్ హాస్పిటల్స్ వంటివి ఉన్నాయి.
ప్రసిద్ధ భవనాలను గులాబీ రంగు లైట్లతో వెలిగించడం ద్వారా భాగ్యనగర నగరవాసుల దృష్టిని ఆకర్షించడం, రొమ్ము కేన్సర్ పై అవగాహన, ఆసక్తి కలిగించడం సంబంధిత లక్ష్యాలతో దీనిని గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నట్టు ఫౌండేషన్ సీఈఓ, డైరెక్టర్ డాక్టర్ పి.రఘురామ్ తెలిపారు.
(చదవండి: టాయ్‌పప్పీ స్ఫూర్తితో.. లెదర్ ఫ్యాషన్ యుటిలిటీ ఆవిష్కరణ)