ప్రసాదం తెచ్చిన తంటా!.. రోడ్డుపైనే సెలైన్లు పెట్టి..

Hundreds Of Patients Treated On Road In Maharashtra - Sakshi

వందలాది మంది రోగులు నడి రోడ్డు మీదే చికిత్స అందించారు వైద్యులు. పైగా చెట్లకు తాళ్లు కట్టి..వాటికి సైలెన్స్‌ బాటిళ్లను వేలాడదీశారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రాలోని బుల్దానాలో వారం రోజుల పాటు జరిగిన మత కార్యక్రమంలో అపసృతి చోటు చేసుకుంది. ఆఖరి రోజున ప్రసాదంగా తీసుకున్న ఆహారం కారణంగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. అయితే అంతమందిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ బెడ్‌ల కొరత కారణంగా చాలామందిని రోడ్డుమీదే పడుకోబెట్టి చికిత్స అందించారు. వారందరికి చెట్లకు కట్టివేసిని తాళ్ల సాయంతో సైలెన్‌ వేలాడదీసి ఇవ్వడం జరిగిది. అయితే దాదాపు 300 మంది అస్వస్థకు గురవ్వగా, వారిలో30 మంది పరిస్థితి విషమంగా ఉదని అధికారులు చెబుతున్నారు. దాదాపు 300 మంది అస్వస్థకు గురైనట్లు తెలిపారు. 

ఈ మేరకు బాధితులు మాట్లాడుతూ..సమయానికి ఆస్పత్రిలో వెద్యులు ఎవరూ లేరని వాపోయారు. రోగులకు వైద్యం చేయించేందుకు ప్రైవేట్‌ వైద్యులను పిలిపించల్సి వచ్చిందని అన్నారు. కాగా ఆ జిల్లా కలెక్టర్‌ కిరణ్‌ పాటిల్‌ మాట్లాడుతూ..మెడికల్‌ ఎమర్జెన్సీ తలెత్తడంతో ఇతర అవసరమైన వైద్య పరికరాలతో సహ వైద్యుల బృందాలతో సత్వరమే చికిత్స అందిస్తున్నామని అన్నారు. అలాగే ప్రసాదం నమునాలు ల్యాబ్‌కి పంపించి పరీక్షలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 

(చదవండి: ఈ షర్ట్‌ చాలా కాస్ట్‌లీ గురూ!)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top