Maharashtra Man With Golden Shirt: ఈ షర్ట్‌ చాలా కాస్ట్‌లీ గురూ!

Maharashtras Gold Shirt Man Makes It to Guinness World Records - Sakshi

అత్యంత ఖరీదైన చొక్కా అంటే మహా అయితే రూ. 500 నుంచి మొదలై వెయ్యి రూపాయల పైన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మంచి బ్రాండెడ్‌ షర్ట్‌ అయితే ఐదు వేల నుంచి పదివేలు వరకు ఉండొచ్చు. లక్షల్లో పలికే షర్ట్‌ గురించి విన్నారా. అంత ఖరీదైన షర్ట్‌ ఎవరైన కొంటారా? ధరిస్తారా అని సందేహించొద్దు. ఎందుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చొక్కాగా నిలిచిన దాన్ని ఓ వ్యక్తి సొంతం చేసుకుని ధరిస్తున్నాడు కూడా. ఎవరా వ్యక్తి? ఏంటతని బ్యాగ్రౌండ్‌ చూద్దామా!

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు పంకజ్ పరాఖ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చొక్కాను సొంతం చేసుకుని ధరిస్తున్నాడు. ఆ షర్ట్‌ని సొంతం చేసుకోవడంతో పంకజ్‌ 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుని వార్తల్లో కూడా నిలిచాడు. 

దీని ధర ఏంకంగా రూ.98,35,099. అతని స్నేహితులు అతనిని ఆప్యాయంగా 'ది మ్యాన్ విత్ ది గోల్డెన్ షర్ట్' అని పిలుస్తారు. ఇవిగాక పరాఖ్‌ దగ్గర  చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. అందులో ఈ బంగారు చొక్కా కూడా ఒకటి. 4.10 కేజీల బంగారు చొక్కా ధర ఇప్పుడు రూ.1.30 కోట్లు.  దీంతోపాటు బంగారు గడియారం, అనేక బంగారు గొలుసులు, పెద్ద బంగారు ఉంగరాలు, బంగారు మొబైల్ కవర్ అండ్  బంగారు ఫ్రేమ్డ్ గ్లాసెస్ ఉన్నాయి. అలాగే పది కిలోల బంగారు దుస్తులు, లైసెన్స్ రివాల్వర్‌తో అతని నడక అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఖరీదైన వస్తువులన్నింటిని సంరక్షించేందుకు  ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా నియమించాడు పంకజ్‌.

ఈ మేరకు పంకజ్‌ మాట్లాడుతూ.. ఈ షర్ట్‌ని తాను సొంతం చేసుకోవడంతో యావత్‌ ప్రపంచానికి నా పేరు తెలిసిపోవడమే గాక మంచి పేరు రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు.  ఇక పంకజ్ ఎనిమిదవ తరగతితోనే పాఠశాల చదువుకి స్వస్తి పలికి తన కుటుంబ  చేస్తున్న వస్త్ర వ్యాపారాన్ని చూసుకునేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే పంకజ్‌  స్వతంగా వ్యాపారం చేయడం మొదలు పెట్టాడు. 

ఆ మంచి వ్యాపారవేత్తగా నిలదొక్కుకోవడంతే రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఆ తరువాత ఏడాదికే అతను ముంబైకి 260 కి.మీ దూరంలో ఉన్న యోలా పట్టణంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ అయ్యాడు. అయితే తనకు ఈ బంగారు చొక్కా ధరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నాడు పంకజ్‌. దీన్ని షర్ట్‌ని ఈజీగానే కడగొచ్చట. ఇక పంకజ్‌కి దాృతృత్వం కూడా ఎక్కువ. అందుకు సంబంధించిన కార్యక్రమాన్నింటిలోనే పాలుపంచుకుంటాడు. 

(చదవండి: రష్యా డాన్స్‌ ఇంత అందంగా ఉంటుందా?)

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top