కడుపునిండా తిన్నా బరువు తగ్గించే పరోటా రెసిపి | Sakshi
Sakshi News home page

Oats Beetroot Paneer Paratha: కడుపునిండా తిన్నా బరువు తగ్గించే పరోటా... రెసిపి ఇలా

Published Mon, Aug 14 2023 12:24 PM

How To Make Oats Beetroot Paneer Paratha Recipe - Sakshi

బరువు పెరగకుండా ఉండేందుకు, పెరిగిన బరువు తగ్గించుకునేందుకు తిండి మానేస్తుంటారు. కానీ తింటూనే బరువు తగ్గాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే  కడుపునిండా తింటూ బరువుని తగ్గించుకునే వంటకాలతో ఈ వారం వంటిల్లు...

ఓట్స్‌ బీట్‌రూట్‌ పన్నీర్‌ పరాటా తయారీకి కావల్సినవి:
వేయించిన ఓట్స్‌ – కప్పు; బీట్‌రూట్‌ ప్యూరీ – కప్పు; పన్నీర్‌ తరుగు – అరకప్పు;
గోధుమ పిండి – అరకప్పు ; జీలకర్ర – అరటీస్పూను; వాము – అరటీస్పూను;
కారం – అరటీస్పూను; ఉప్పు – అరటీస్పూను ; నూనె – రెండు టీస్పూను.

తయారీ విధానమిలా:
పెద్దగిన్నెలో ఓట్స్, బీట్‌రూట్‌ ప్యూరీ, పనీర్‌ తరుగు, గోధుమ పిండి, జీలకర్ర, వాము, కారం, ఉప్పు వేసి కలపాలి.
కొద్దికొద్దిగా నీళ్లుపోసుకుంటూ పరాటా పిండి ముద్దలా కలుపుకోవాలి.
ఈ ముద్దను ఉండలుగా చేసుకుని పరాటాల్లా వత్తుకోవాలి.
పరాటాలను రెండువైపులా గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు కాల్చుకుంటే పరాటా రెడీ.పెరుగు లేదా చట్నీతో సర్వ్‌చేసుకోవాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement