నీ స్నేహం..ఓ సంబరం.. | Friendship Day Celebrations And Importance And Its Significance | Sakshi
Sakshi News home page

Friendship Day: నీ స్నేహం..ఓ సంబరం..

Aug 1 2025 11:45 AM | Updated on Aug 1 2025 12:04 PM

Friendship Day Celebrations And Importance And Its Significance

కొంత కాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట.. రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం.. రూపురేఖలు వేరట.. ఊపిరొకటే చాలట.. ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం.. కంటిపాపను కాపు కాసే జంట రెప్పల కాపలాగా.. నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి.. స్నేహమంటే రూపులేని ఊహ కాదని.. లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి.. అని సిరివెన్నెల రచించిన పాట అందరికీ సుపరిచితమే.. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచి్చందంటే!.. అదే ‘ఫ్రెండ్‌షిప్‌ డే’.. ఫ్రెండ్‌షిప్‌ డే అంటే కేవలం బహుమతులు ఇచి్చపుచ్చుకోవడం లేదా ఇన్‌స్టాలో కథలు చెప్పడం మాత్రమే కాదు. నిజానికి, ఈ వేడుక రేపటి జ్ఞాపకాలుగా మారే అనుభవాలకు వేదిక. ట్రెడిషన్, ట్రెండ్‌ను మిళితం చేసే హ్యాపెనింగ్‌ సిటీ అయిన మన భాగ్య నగరంలో ఆ జ్ఞాపకాల సృష్టికి అనువైన ప్రదేశాలెన్నో.. అలాంటి కొన్ని ప్రదేశాలు, ఈవెంట్ల వివరాలు, అనువైన ప్రదేశాలను కోరుకునే ఫ్రెండ్‌షిప్‌ కోసం..     

ప్రతి యేడాదిలానే ఈ యేడాది కూడా ఆగస్టు నెల్లో తొలి ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డే జరుపుకోనున్నారు స్నేహితులు. ఇందుకు నగరంలో పలు వేదికలు సిద్ధమవుతున్నాయి. ఇది స్నేహితులతో రోజూ మాదిరి సరదాగా కాకుండా మరింత ప్రత్యేకంగా గడపడానికి సరైన సందర్భం.. అందుకు అనువైన ప్రదేశాలెన్నో నగరంలో వేదిక కానున్నాయి. 

ఫ్రెండ్స్‌.. జంతు ప్రేమికులైతే బంజారాహిల్స్‌లోని పెట్‌ కేఫ్‌ లాంటివి సరైన ఎంపిక. ఇక్కడ పిల్లులను కౌగిలించుకోవచ్చు, అందమైన శునకాలను పలకరించవచ్చు. ఇది స్నేహితుల రోజువారీ ఒత్తిడిని తగ్గించడానికి అనువైన ప్రదేశం.  

నగరంలో మొట్టమొదటి ఆర్ట్‌ థెరపీ స్పాట్‌ జూబ్లీహిల్స్‌లోని లైజుర్‌–ఆర్ట్‌ కేఫ్, లైజుర్‌ పెయింటింగ్, టఫ్టింగ్, కుండలు, టీ–షర్ట్‌ పెయింటింగ్, కొవ్వొత్తుల తయారీ లాంటివెన్నో అందిస్తుంది. కళాభిమానులైన స్నేహితులు ఆర్ట్‌ జామింగ్‌ లేదా సృజనాత్మక సెషన్‌లను ముందస్తుగా బుక్‌ చేసుకోవచ్చు. బ్రష్‌స్ట్రోక్స్‌ లేదా టఫ్టింగ్‌ సెషన్‌ మధ్య కాఫీని ఆస్వాదించవచ్చు. 

జూబ్లీహిల్స్‌లోని బోర్డ్‌ కేఫ్‌లో స్క్రాబుల్‌ వంటి క్లాసిక్‌ల నుంచి తంబోలా వంటి పార్టీ గేమ్‌ల వరకూ 700 కంటే ఎక్కువ గేమ్స్‌ ఉన్నాయి. ఆటలకు కొత్తవారైతే హోస్ట్‌ల ద్వారా సహాయం అందుకోవచ్చు. ఇక్కడ గంటల తరబడి నవ్వుతూ, స్నేహితులతో సరదా పోటీలతో గడపవచ్చు. 

జూబ్లీహిల్స్‌లోని బేస్‌ కాఫీ, పికిల్‌ బాల్‌ కేఫ్‌.. నగరంలో కొత్త జీవనశైలిలో ఒకటైన పికిల్‌ బాల్‌ కాఫీలని విలీనం చేస్తుంది. స్నేహితులు బాల్‌ గేమ్స్‌ ఆడవచ్చు, ఆ తరువాత కోల్డ్‌ బ్రూలు  స్నాక్స్‌తో రీఛార్జ్‌ కావచ్చు. 

ప్రకృతిని, ప్రశాంతతను ఇష్టపడే ఫ్రెండ్స్‌ ప్రప్రథమ గార్డెన్‌ థీమ్డ్‌ అర్బన్‌ నెమో కేఫ్‌ని ఎంచుకోవచ్చు. ఇది పచ్చని మొక్కలతో రిలాక్స్‌డ్‌ ఓపెన్‌–ఎయిర్‌ సీటింగ్‌ బొటానికల్‌ డెకార్‌ను అందిస్తుంది. ఈ కేఫ్‌ ఫ్రెండ్‌షిప్‌ డే కార్యకలాపాలను ప్రత్యేకంగా నిర్వహించనప్పటికీ.. పచ్చదనంతో పాటు అల్లుకున్న ప్రశాంతత నిశ్శబ్దంగా ఫ్రెండ్‌షిప్‌ డేని ఆస్వాదించడానికి సరిపోతుంది. 

సృజనాత్మక కో–వర్కింగ్, వర్క్‌షాప్‌లు లేదా ఈవెంట్‌లతో కూడిన హైబ్రిడ్‌ స్పేస్‌ మిక్సింగ్‌ కేఫ్‌ ఛార్జీ. ఇక్కడ ఓపెన్‌ మైక్‌ నైట్స్, ఇండీ బ్రాండ్‌ పాప్‌–అప్‌లు, రైటింగ్‌ సర్కిల్స్, ఆర్ట్‌ వర్క్‌షాప్‌లు లేదా స్టాండ్‌–అప్‌ కామెడీని స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేయవచ్చు. 

ప్రత్యేక కార్యక్రమాలు.. 

కోకాపేట్‌లోని ది రాబిట్‌ లాంజ్‌లో ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా డీజే కిమ్, డీజే సినాయ్‌లు సందడి చేయనున్నారు. లిక్విడ్‌ డ్రమ్స్, సాక్సాఫోన్, దర్బూకా.. వంటి వెరైటీ సంగీత పరికరాలు ఆకట్టుకోనున్నాయి. 

నగర శివార్లలో ఉన్న ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్స్‌లో ఫ్రెండ్‌షిప్‌ డే వినోదభరితంగా జరగనుంది. శని, ఆదివారాలు రెండు రోజులపాటు వేడుకలు ప్లాన్‌ చేశారు. వేవ్‌ పూల్‌ డీజే సెట్‌లు, ఫోమ్‌ పారీ్టలు, ఇంటరాక్టివ్‌ గేమ్‌లు సూర్యాస్తమయం నుంచి రాత్రి వరకూ కొనసాగే నృత్యోత్సవాలను నిర్వహిస్తున్నారు. 

గచ్చిబౌలిలోని థర్డ్‌ వేవ్‌ కాఫీలో ‘సొంత ఫ్రెండ్‌షిప్‌ డే బ్యాండ్స్‌ తయారు చేసుకోండి’ పేరిట శనివారం వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ కార్యక్రమం ఉంటుంది.  

ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా హిప్‌–హాప్‌ పార్టీ విత్‌ జినీ లైవ్‌ ప్రోగ్రామ్‌ను సోమాజిగూడలోని ఆక్వా ది పార్క్‌లో ఆదివారం నిర్వహిస్తున్నారు. దీని కోసం మిజోరాంకు చెందిన ఆరి్టస్ట్‌ నగరానికి వస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఈ ప్రోగ్రామ్‌ ఉంటుంది.    

(చదవండి: సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్‌గా..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement