ఫ్యాషన్‌ స్టైలిష్ట్‌ మెటర్నిటీ ఫోటో షూట్స్‌.. అర్థవంతంగా, అద్భుతంగా! | Fashion Stylist prerna Chhabra maternity photoshoot goes viral | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ స్టైలిష్ట్‌ మెటర్నిటీ ఫోటో షూట్స్‌.. అర్థవంతంగా, అద్భుతంగా!

Oct 15 2024 3:43 PM | Updated on May 30 2025 10:28 AM

Fashion Stylist prerna Chhabra maternity photoshoot goes viral

న్యూఢిల్లీకి చెందిన లండన్‌ ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌ ప్రేరణ చాబ్రామరికొద్ది రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఫ్యాషన్‌ డిజైనర్‌గా, యూట్యూబర్‌గా  అభిమానులకు దగ్గరైన  ఆమె  ఈ సందర్భాన్ని సంతోషాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంది.  అంతేకాదు  తన భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం  చేసింది.  అలాగే తను ఎందుకు మెటర్నిటీ ఫోటో షూట్‌ చేసుకున్నదీ వివరించింది.

అసలు మెటర్నీటి ఫోటో షూట్ అవసరమా అని ఆలోచించి చివరికి రెండు రకాలు ఫోటోషూట్‌ చేసుకున్నాను అంటూ ఇన్‌స్టాలో అద్భుతమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఫ్యాషన్‌ డిజైనర్‌ను  కాబట్టి  క్రియేటివ్‌గా ఉంటాను, కనుక మెటర్నిటీ ఫోటోషూట్‌కూడా విభిన్నంగా ఉండాలని ఆలోచించానని ఆమె తెలిపారు.  (పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్‌ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్‌ అండ్‌ టిప్స్‌)

‘‘మొదటి ఫోటో షూట్‌ కోసం పర్పుల్ అండ్‌  పింక్‌ కలర్‌ డ్రెస్‌ ఎంచుకున్నా..దీన్నే ది పెర్ల్స్ ఆఫ్ జాయ్ అంటాం. త్వరలోనే తల్లికాబోతుండటం ఆనందాన్ని తీసుకొచ్చింది.  ఇపుడు అమ్మగామారబోతున్నాను.. దాదాపు కలలో జీవిస్తున్నాను. స్వేచ్ఛకు ప్రతీక అయిన  పసుపు రంగులో  రెండో ఫోటోషూట్‌ చేశాను. దీన్ని గోల్డెన్ బ్లూమ్ అంటాం. ఈ సందర్భంగా అమ్మ నాతో ఉండటం ఇంకా సంతోషం’’ అంటూ  ఇన్‌స్టా పోస్ట్‌లో ప్రేరణ వెల్లడించింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement