
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఫెర్‌ఫ్యూమ్స్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. 'ట్రంప్ ఫ్రాగ్రెన్స్' కింద తనరెండు రకాల సెంట్ ఉత్పత్తులను లాంచ్ చేశారు. 'విక్టరీ 45-47' పేరుతో వీటిని తీసుకొచ్చారు. తన ప్రైవేట్ సోషల్ మీడియాలో ట్రంప్ ఈవిషయాన్ని ప్రకటించారు.
ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, డెమోక్రటిక్ ప్రత్యర్థి కమలా హారిస్‌ను ఓడించి, ఘన విజయానికి గుర్తుగా ఈ పెర్‌ఫ్యూమ్ బాటిల్స్‌కు ‘విక్టరీ 45-47' అని పేరు పెట్టారట. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడిగా తొలిసారి, రెండోసారి 47వ అధ్యక్షుడిగా రెండుసార్లు ఎంపిక కావడానికిది సింబాలిక్ అట.
ఇది చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!
"పురుషులు, మహిళలకోసం ట్రంప్ ఫ్రాగ్రెన్స్‌లు వచ్చాయి. ఇవి గెలుపు.. బలం..విజయం అనే ట్యాగ్‌లతో తీసుకొచ్చారు. ఒక బాటిల్ తీసుకోండి, మీ ప్రియమైనవారి కోసం కూడా ఒకటి తీసుకోవడం మర్చిపోవద్దు. ఆనందించండి, గెలుస్తూ ఉండండి!"అంటూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం విశేషం.

ఈ సెంటు బాటిల్స్ గెట్స్ ట్రంప్ ఫ్రాగ్రెన్స్. కామ్‌లో ట్రంప్ సంతకంతో పాటు , ట్రంప్ ఐకానిక్ బంగారు విగ్రహాన్ని కూడా అమర్చారు. ఈ పరిమిత ఎడిషన్ పెర్ఫ్యూమ్, కొలోన్ ధర 249 డాలర్లు అంటే దాదాపు 21 వేల రూపాయలు.