
నేషనల్ క్రష్ అంటే ఎవరు? ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా రష్మిక అని ఒకటే సమాధానం ఉండొచ్చు కానీ ఇప్పుడు మరో నేషనల్ క్రష్ కూడా వచ్చేసింది. పైగా రష్మిక తానే స్వయంగా తెచ్చేసింది. పాన్ ఇండియా లెవల్లో క్రేజీ హీరోయిన్‌గా మారి అందం అభినయంతో పరవశాలను పంచుతున్న మన శ్రీవల్లి...డియర్ డైరీ పేరుతో పరిమళాలను కూడా మోసుకొస్తోంది. ఇటీవలే పెర్‌ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన రష్మిక దీని వెనుక తన ఆలోచనలను అనుభవాలను భావోద్వేగాలను పంచుకుంది.
అన్ని విధాలుగా, రెండు సంవత్సరాల వ్యయప్రయాసల అనంతరం రూపుదిద్దుకున్న డియర్ డైరీ, రష్మిక మందన్నకు కేవలం ఒక ప్రముఖ సువాసనల ఉత్పత్తికంటే ఎక్కువ. , తన చిన్నతనంలో వ్రాసిన జర్నల్ ఎంట్రీల నుంచి ప్రేరణ పొంది, తరువాత అదే పేరుతో తన ప్రసిద్ధ ఇన్‌స్ట్రాగామ్ సిరీస్‌లోనూ మనం చూసిన డియర్ డైరీ...‘‘ఇది కేవలం వ్యాపార వెంచర్ కాదు,’’ అని ఆమె చెప్పింది. ‘‘సువాసన నాకు చాలా వ్యక్తిగతమైనది. ఇది నన్ను తక్షణమే చిన్ననాటి క్షణాలకు తీసుకువెళుతుంది. నా తల్లి బాడీ లోషన్, కూర్గ్ గాలి సువాసన, నా జీవితంలో ముఖ్యమైన అధ్యాయాలలో నేను ధరించిన పెర్ఫ్యూమ్’’ అంటూ ఆమె గుర్తు చేసుకుంటుంది. ‘‘ ఈ పెర్ఫ్యూమ్‌లు నేను తిరిగి ఇచ్చే మార్గం. ఇది నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కౌగిలింత’’అంటోంది.
డియర్ డైరీ అనే పేరు వెనుక.. ‘‘ నేను కూర్చుని డైరీ రాసేదానిని. దానికి వేరే పేరు పెట్టాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు దాన్ని ఎప్పుడూ ‘డియర్ డైరీ’ అని సంబోధించేదాన్ని. సంవత్సరాల తరువాత, నేను ఇన్‌స్ట్రాగామ్‌లో సిరీస్‌ను ప్రారంభించినప్పుడు, జీవితంలోని చిన్న, నిశ్శబ్ద విషయాలు ముఖ్యమైనవని ప్రజలకు గుర్తు చేయాలనుకున్నాను అందుకే అది సహజమైన కొనసాగింపుగా మారింది’’ అని వెల్లడిస్తుంది.
కర్ణాటకలోని కొడగు (గతంలో కూర్గ్) జిల్లాలోని ఒక చిన్న ప్రాంతమైన విరాజ్‌పేట (విరాజపేట అని కూడా పిలుస్తారు)లో పుట్టి పెరిగిన రష్మిక, కర్ణాటక కొండ ప్రాంత దట్టమైన పచ్చదనం మట్టి గాలితో ఊసులాడుతూ పెరిగింది, ఆమె జ్ఞాపకాలలోకి చొచ్చుకుపోయిన అవన్నీ ఇప్పుడు ఆమె బ్రాండ్.లో ప్రతిఫలిస్తాయి ‘‘అక్కడ ప్రతీ ఇంటికి ఒక వాసన ఉంది’ఆ విషయం‘‘అలాంటి ప్రదేశంలో పెరిగిన ఎవరైనా మీకు చెబుతారు.’’ అంటుందామె. ‘నేను ఆ పెర్ఫ్యూమ్‌ని వేరేగా చూడలేదు. నేను దానిని నాలాగా చూశాను. నేను కేవలం రష్మిక నే అయితే...నేషనల్ క్రష్, ఇర్రీప్లేసబుల్, కాంట్రవర్షియల్ – అనే పేర్లు నాకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అవి కూడా ఈ బ్రాండ్‌లో భాగం అయ్యాయి’’ అంటూ వివరించింది.
ప్రపంచ బ్యూటీ లేబుల్‌లను స్కేలింగ్ చేయడంలో ప్రసిద్ధి చెందిన న్యూయార్క్‌కు చెందిన ది పిసిఎ కంపెనీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఉత్పత్తి డియర్ డైరీ, దీనిలో 3 ఫ్లేవర్స్‌కి నేషనల్ క్రష్, ఇర్రీప్లేసబుల్, కాంట్రవర్షియల్ అంటూ పేర్లు పెట్టడం విశేషం.
మనం కలలు కంటాం. కానీ వాస్తవికత వేరోలా ఉంటుంది‘ అని ఆమె చెప్పింది. ఈ పెర్ఫ్యూమ్ గురించి ‘‘ఇది నా బిడ్డ. మా వంతు ప్రయత్నం చేసాం. ఇప్పుడు అది అందరికీ అందుబాటులో ఉంది, దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వినడానికి సిద్ధంగా ఉన్నాం. వారి అభిప్రాయంతో మా బిడ్డ పెరగాలని నేను కోరుకుంటున్నాను.‘ అంటూ చెబుతోంది రష్మిక.. చూడాలి మరి నేషనల్ క్రష్ వ్యాపారంలో ఎంతగా ఎదుగుతుందో.