వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  | do you these benefits with Buttermilk in summer | Sakshi
Sakshi News home page

వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా? 

Apr 13 2024 1:56 PM | Updated on Apr 13 2024 3:18 PM

do you these benefits with Buttermilk in summer - Sakshi

వేసవి కాలంలో ఎండల ప్రతాపాన్ని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మధ్యాహ్నం ఎండలో సాధారణంగా బయటికి రాకుండా ఉండటంమంచిది. అలాగే  ఎక్కువ నీళ్లు తాగాలి.  వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని  పానీయాలను తీసుకోవాలి.  ఈ విషయంలో మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా  కాస్త చవగా అందరికీ అందుబాటులో ఉండేది కూడా.

వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూద్దాం!

► అద్భుతమైన ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాల గని  మజ్జిగ. వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.  అధిక ఉష్ణంనుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు.
► పల్చటి మజ్జిగలో  నిమ్మకాయ,కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కాస్తంత కొత్తమీర, పుదీనా  కలుపుకుని తాగితే మరీ మంచిది. రుచికీ రుచీ తగులుతుంది.  వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.
► మజ్జిగ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలతో  చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
► ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.  జీర్ణసమస్యలు పోతాయి.  రక్త సరఫరా మెరుగుపడుతుంది. 

 సౌందర్య పోషణలో
►చర్మం కూడా  కాంతివంతంగా మారుతుంది.  వేసవిలో వేధించే చెమట పొక్కుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
►మజ్జిగలో పెద్ద మొత్తంలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ (AHA) చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది, చర్మంపై నల్ల మచ్చలు , టాన్డ్ ప్యాచ్‌లకు సహజ పరిష్కారంగా పనిచేస్తుంది.
► కాల్షియం లోపం ఉన్న వారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు ధృడంగా మారుతాయి.
►  కాల్షియం, విటమిన్స్‌ , ఇతరపోషక విలువల  కారణంగా మజ్జిక  కొన్ని రకాల జబ్బులను నివారిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement