'లవంగం టీ' ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!?

Do You Know How Many Uses Of Clove Tea - Sakshi

భారతీయులు ఎక్కువగా వినియోగించే సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. శీతాకాలంలో చాలామందిలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేకరకాల ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది జలుబు దగ్గు సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ లవంగాల టీని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే సుగుణాలు గొంతునొప్పి, కఫం వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.

శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి..
కొంతమందిలో వాతావరణంలోని తేమ పరిమాణాలు తగ్గడం పెరగడం కారణంగా శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా జ్వరం ఇతర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే చలికాలంలో తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా లవంగాలతో తయారుచేసిన టీని తాగాల్సి ఉంటుంది.

దగ్గు నుంచి ఉపశమనం..
శీతాకాలంలో చాలామందిని వేధించే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి.. ఈ దగ్గు కారణంగా చాలామంది ఊపిరితిత్తుల సమస్యల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి ఉపశమనం పొం​దడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరంలో కఫాన్ని తొలగించేందుకు కూడా సహాయపడతాయి.

జీర్ణక్రియ మెరుగు పడుతుంది..
కొంతమందిలో చలి కారణంగా సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ సమయంలో చాలామందిని వేధించే సమస్య జీర్ణ క్రియ మందగించడం. అయితే దీనికి కారణంగా చాలామందిలో మలబద్ధకం, గ్యాస్‌ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా లవంగాలతో తయారు చేసిన టీని తీసుకోండి.

ఇవి చదవండి: నడుము నొప్పా? సింపుల్‌గా ఇలా తగ్గించుకోండి!

whatsapp channel

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top