అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్‌ ధర ఎంతంటే..? | Sakshi
Sakshi News home page

అందాల భామ అదితి గౌతమి ధరించి డ్రస్‌ ధర ఎంతంటే..?

Published Sun, Sep 10 2023 5:50 PM

Do You Know Aditi Gautam Wearing Fashion Brands - Sakshi

‘నేనింతే’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన నటి.. శియా గౌతమ్‌ అలియాస్‌ అదితి గౌతమ్‌. తొలి సినిమాతోనే చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమా చాన్స్‌లు ఎలా ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పటికప్పడు తన ఫ్యాషన్‌ స్టయిల్‌ ఫొటోలు, పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. ఆ ఆకర్షణకు మెరుగులు దిద్దుతున్న ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఏంటో చూద్దాం..  

ఇంద్‌ శ్రీ 
హైదరాబాద్‌ నిఫ్ట్‌ నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసిన ఇంద్‌ శ్రీ .. 2012లో తన పేరుతోనే ఓ బోటిక్‌ ప్రారంభించింది. సంప్రదాయ, క్యాజువల్‌ వేర్‌ను అందించటం ఈ బ్రాండ్‌ ప్రత్యేకత. ఆఫ్‌ బీట్‌ ఫ్యూజన్‌ వేర్, డ్రేప్, ప్రింట్స్, హ్యాండ్‌ ఎంబ్రాయిడరీతో   ఏ వయసు వారికైనా నచ్చే, నప్పే డిజైన్స్‌ ఇక్కడ లభిస్తాయి. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక్కడ అదితి ధరించిన ఇంద్‌ శ్రీ కాస్ట్యూమ్‌ డిజైన్‌ ధర రూ. రూ. 11,500 

హౌస్‌ ఆఫ్‌ క్వాడ్ర
హై క్వాలిటీ, లేటెస్ట్‌ వజ్రాభరణాలకు పెట్టింది పేరు ఈ బ్రాండ్‌. మెషిన్‌ మేడ్‌ కాకుండా నైపుణ్యంగల స్వర్ణకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న నగలే ఈ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకున్న వాల్యూ. దేశంలోనే పేరెన్నికగన్న జ్యూలరీ బ్రాండ్‌లలో ఇదొకటి! ధరలు ఇటు సామాన్యులూ కొనేలా అటు సెలెబ్రిటీల స్థాయినీ పెంచేలా ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.

(చదవండి: ముక్కున ధరించే ముక్కెర ఇలా ఉంటే.. మీ లుక్‌ అదిపోతుంది!)

Advertisement
 
Advertisement
 
Advertisement