Do Plants Need Water Even When It Rains - Sakshi
Sakshi News home page

వర్షాకాలంలో మొక్కలకు నీళ్లు పొయ్యాల్సిన అవసరం ఉందా?

Published Wed, Jul 12 2023 3:36 PM

Do Plants Need Water Even When It Rains - Sakshi

వర్షాలు పడుతున్నాయి కదా ఇంక మొక్కలకు నీళ్లు పోయనవసరంలేదని కొంతమంది అనుకుంటారు. కానీ వర్షాల్లో కూడా కొన్నిరకాల మొక్కలకు నీళ్లు పోస్తేనే గార్డెన్‌ పచ్చగా కళకళలాడుతుంది. అందుకు ఇవే కారణాలు...

సాధారణంగా మొక్కలకు వర్షాకాలంలో సహజసిద్ధంగా నీళ్లు అందుతాయి. కానీ, కుండీల్లో ఉన్న మట్టి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచలేకపోతే, మొక్కలు త్వరగా ఎండిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు తేమను చూసుకుని మొక్కలకు నీళ్లు పోయాలి. 

కుండీల్లో పెరుగుతోన్న కొన్ని రకాల మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి. దట్టంగా ఉన్న ఆకులు, కొమ్మలు కూడా వెడల్పుగా విస్తరించి చినుకులను అడ్డుకుంటాయి.

♦ వర్షం చినుకులు కొమ్మలపై పడి పక్కకు జారిపోతాయి. దీనివల్ల వేర్లకు సరిగా నీరు అందదు. అందువల్ల గుబురుగా ఉన్న కుండీ మొక్కలకు తప్పని సరిగా నీళ్లుపోయాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement