Deepika Padukone: పూల కుర్తాలో మెస్మరైజ్‌ చేస్తున్న దీపికా.. | Deepika Padukone Glowing In Floral Kurta With Rs 3 Lakh Shoulder Bag | Sakshi
Sakshi News home page

పూల కుర్తాలో మెస్మరైజ్‌ చేస్తున్న దీపికా.. ప్రెగ్నెంట్‌ మహిళల బెస్ట్‌ డ్రెస్‌ ఇది..!

Aug 9 2024 4:16 PM | Updated on Aug 9 2024 8:35 PM

Deepika Padukone Glowing In Floral Kurta With Rs 3 Lakh Shoulder Bag

బాలీవుడ్‌ నటి, కాబోయే తల్లి దీపికా పదుకొణె తన అందం అభినయంతో వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల కల్కి మూవీ ప్రమోషన్లో హైహిల్స్‌తో వచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచింది. కాబోయే తల్లి దీపికా తన బేబి బంప్‌తోనే కల్కి మూవీలో నటించటం విశేషం. ఇటీవల తన భర్త రణ్‌వీర్ తో పాటూ ముంబాయి డిన్నర్ డేట్‌కు వెళ్లింది. అక్కడ ఓ రెస్టారెంట్‌లో దీపికా తన బాడీగార్డుతో.. కెమెరాకు చిక్కింది. 

కాబోయే తల్లి అయిన దీపికా వైట్ ప్యాంట్, సింపుల్ మేకప్ లుక్ తో సబ్యసాచి పూల కుర్తా ధరించింది. ఆమె ప్రెగ్నెన్సీ డ్రెస్ కాబోయే తల్లులకు సౌకర్యాంగా ఉండే డ్రెస్‌ ఇది. ఈ బ్యూటీ తన ప్రెగ్నెన్సీ లుక్ కోసం చక్కటి పూల కుర్తాలో మెరిసింది. స్వీకరించింది. ఈ పూల కుర్తీని సవ్యసాచి డిజైన్ చేశారు. 

అక్కడ పలువురి అభిమానులతో  మాట్లాడటమే గాక ఫోటోలకు ఫోజులిస్తూ కట్టిపడేసే అందంతో అలరించింది. ఇక్కడ దీపికా తన రేంజ్‌కి తగ్గట్టు లూయిస్ విట్టన్ హ్యాండ్‌ బ్యాగ్‌ను ధరించింది. చెప్పాలంటే ఈ  పూలకుర్తీలో బేబీ బంప్‌ని దాచేస్తూ సరికొత్త రూపంతో అందంగా కనిపించింది. కాగా, ఆమె ధరించిన బ్రాండెడ్‌ బ్యాగ్‌ ధర ఏకంగా 3.25 లక్షలు పలుకుతుందట.

 

(చదవండి: స్పేస్‌లో ఎక్కువ కాలం ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా..? బెస్ట్‌ స్పేస్‌ ఫుడ్స్‌ ఇవే..!)

 

Advertisement
 
Advertisement
Advertisement