
కోకా-కోలా తన ట్రేడ్‌మార్క్ కోకా-కోలా లైనప్‌ను విస్తరింపజేస్తూ అమెరికా మార్కెట్ కోసం అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌కు బదులుగా చెరకు చక్కెరతో తయారు చేసిన కేన్ షుగర్ కోకా కోలా సాఫ్ట్ డ్రింక్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీ రెండవ త్రైమాసిక ఆదాయాలప్రకటన సందర్బంగా ఈ విషయాన్ని ప్రకటించింది. డైట్ కోక్ అభిమానిగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తర్వాత కోకా-కోలా అమెరికాలో కేన్ షుగర్ కోక్‌ను ప్రారంభించినట్లు ధృవీకరించింది.
గత వారం అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నిజమైన చెరకు చక్కెరతో చేసిన కోక్‌కోసం కోకా-కోలాను ఒప్పించానని పేర్కొంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. జూలై 16న ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన పోస్ట్‌లో తాను దీనిపై తాను కోకా-కోలాతో మాట్లాడుతున్నానని, వారు అలా చేయడానికి అంగీకరించారని" తెలిపారు.
మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలకు అమెరికా మొక్కజొన్న పరిశ్రమనుంచి సహా మిశ్రమ స్పందనలు వచ్చాయి.అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌ను చెరకు చక్కెరతో భర్తీ చేయడం సమంజసం కాదు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ తయారీ ఉద్యోగాలు, అమెరికన్ రైతులు , వాణిజ్య లోటును తగ్గించడంకోసమే ఉన్నారంటూ కార్న్ రిఫైనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు , CEO జాన్ బోడే విమర్శించారు. అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌ను చెరకు చక్కెరతో భర్తీ చేయడం వల్ల వేలాది అమెరికన్ ఆహార తయారీ ఉద్యోగాలు తగ్గిపోతాయి. వ్యవసాయ ఆదాయం తగ్గుతుంది ,విదేశీ చక్కెర దిగుమతులు పెరుగుతాయన్నారు.
ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పట్టుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం
కాగా కోకా-కోలా మొదట తన అన్ని పానీయాలలో చెరకు చక్కెరను ఉపయోగించేది. కానీ 1984లో చక్కెర ధరలు పెరగడంతో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్‌కు మారిందని ఫార్చ్యూన్ తెలిపింది. సాధారణంగా "మెక్సికన్ కోక్" అని పిలువబడే చెరకు చక్కెర కోకా-కోలా, మెక్సికో నుండి దిగుమతుల ద్వారా అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే అందుబాటులో ఉంది, అక్కడ దీనిని గాజులో బాటిల్ చేసి సాంప్రదాయ తీపి పద్ధతులను ఉపయోగించి తయారు చేస్తారు.
చదవండి: ఏనుగులంటే ప్రాణం : కానీ మల్టీ మిలియనీర్‌ని ఏనుగే తొక్కేసింది!