మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ.. | Clay Pot Accident On Gas Stove Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..

Sep 6 2023 11:20 AM | Updated on Sep 10 2023 3:57 PM

Clay Pot Accident On Gas Stove Goes Viral On Social Media - Sakshi

ఇటీవల కాలంలో పాతకాలం పద్ధతితో వండే వంట స్టయిల్‌ని అనుసరిస్తున్నారు అతివలు. కానీ ఇలా మన బామ్మల కాలం నాటి పద్ధతిలో వండుకోవడం మంచిదే గానీ ఎలా వండాలో ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోకపోతే లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. 

సంప్రదాయ భారతీయ పద్ధతిలో వంట చేయాలనుకుంది ఫుడ్‌ బ్లాగర్‌ ఫర్హా ఆఫ్రీన్‌. అందులో భాగంగానే ఓ మట్టి ప్రాతను స్టవ్‌పై పెట్టింది. అందులో నూనె వేసి జీలకర్ర, కరేపాకు ఇలా వేసిందో లేదో అంతే ఒక్కసారిగా భగ్గున మంట లేచి.. కుండ పగిలి చెల్లచెదురుగా పడిపోయింది. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియోను ఆఫ్రిన్‌ షేర్‌ చేస్తూ..దయచేసి మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవద్దు అని గట్టిగా హెచ్చరిస్తోంది.

తనలా ట్రై చేయాలనుకునేవారు ఛెఫ్‌లు లేదా పెద్దవాళ్లను అడిగి సలహలు తీసుకుని మరీ ప్రయత్నించండి అని సూచిస్తోంది ఆఫ్రిన్‌. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీంతో నెటిజన్లు కొత్తగా మట్టి పాత్రల్లో చేయాలనుకుంటే పెద్దలను అడగాలని ఒకరు, మట్టిపాత్రలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆరనిచ్చాక వండాలని మరోకరు సలహలు ఇస్తూ పోస్టులు పెట్టారు.  

(చదవండి: జపాన్‌లో టీచర్స్‌ డే ఎలా జరుపుకుంటారో తెలుసా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement