
జపాన్‌లో అసలు ఉపాధ్యాయుల దినోత్సవమే ఉండదట. ఔను! మీరు వింటుంది నిజమే. అక్కడ అసలు ఆ దినోత్సవమే చేసుకోరట. ఇదేంటి సైన్సు అండ్ టెక్నాలజీ పరంగా ఎంతో ఎదిగిన దేశంలో ఇలాంటి "డే" ఉండకపోవటం ఏమిటి అనిపిస్తుంది గదా!
జపాన్ వాళ్లు ప్రత్యేకించి ఉపాధ్యాయ దినోత్సవం అని ఏమి జరుపుకోరు. అక్కడ ఉపాధ్యాయుల పట్ల వారు కనబర్చే తీరుని చూస్తే కచ్చితంగా అవాక్కవుతారు. ఓ టీచర్ గనుక మెట్రో రైలు లేదా బస్సు మరేదైనా ప్రజా రవాణాలో వెళ్లితే ప్రజలు తక్షణమే లేచి నిలబడి కూర్చొమని సీటు ఇస్తారట. అంతలా ప్రజలు టీచర్ల పట్ల గౌరవ ఆదరాభిమానాన్ని చూపిస్తారట వాళ్లు.
జపాన్‌లో ఉపాధ్యాయుల కోసమే ప్రత్యేకంగా ఒక దుకాణం కూడా ఉంటుందట. అక్కడ వారు తక్కువ ధరకే కావల్సిన వస్తువులను కొనుగోలు చేసి తీసుకువెళ్లొచ్చట. అంతేగాదు జపాన్ వాసులు ఉపాధ్యాయ వృత్తిని అత్యంత గౌరవప్రదమైన వృత్తిగా భావిస్తారు. మెట్రోలో వారికి ప్రత్యే సీట్లు కేటాయిస్తారు. వారి కోసం ప్రత్యేక దుకాణాలే గాక ఎక్కడికైనా వెళ్లేందుకు టిక్కెట్ల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదట.
ఆఖరికి జపాన్ పారిశ్రామిక వేత్తలు సైతం ఉపాధ్యాయులు దుకాణాలకు వస్తే సంతోషిస్తారట వారికి తగిన గౌరవం ఇస్తారట. వారు కొనగలిగిన ధరకే వస్తువులను ఇచ్చి పంపిస్తారట కూడా. అందువల్ల జపనీస్ ఉపాధ్యాయులుకు ప్రత్యేకంగా గౌరవించి సెలబ్రేషన్ చేసేలా ఓ రోజు అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు అక్కడ ఉపాధ్యాయుల జీవితం వేడుకగా, గౌరవప్రదంగా ఉంటుంది.