
ఒక్కోసారి ఇంటర్‌నెట్ సాంకేతికత కూడా జంటల మధ్య గొడవలకు కారణమవుతుంటుంది. ప్రమాదవశాత్తు కనెక్ట్ అయిన వైఫై ఓ జంట విడిపోయేందుకు దారితీసింది. నిజానికి ఆమె తప్పు చేయపోయినా మోసం చేసిన వ్యక్తిగా నిలబడాల్సి వచ్చింది. అసలు విషయం తెలుసుకుని..తన నిజాయితీని నిరూపిద్దామన్నా..విధి ఆ అవకాశమే లేకుండా చేసింది ఆ అమ్మాయికి.
అసలేం జరిగిందంటే.. నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్‌లోని ఒక హోటల్‌కు లీ అనే మహిళ తన ప్రియుడితో కలిసి సరదాగా సెలవుల్లో ఎంజాయ్ చేద్దామని ఓ హోటల్‌కి వస్తారు. అక్కడ హాయిగా షికార్లు తిరిగి ఎంజాయ్ చేసి..ఇంటికి వెళ్లిపోదామనుకుంటారు. ఆ క్రమంలో హోటల్‌ని ఖాళీ చేస్తుండగా.. ఆమె ఐడీ కార్డు కనిపించదు. దాంతో ఆమె ఐడీ కార్డుని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుందామనుకుంటుంది.
ఆ నేపథ్యంలో అనుకోకుండా ఆ హోటల్ వై-ఫైకి తన మొబైల్ ఆటోమేటిగ్గా కనెక్ట్ అవుతుంది. అంతే ఒక్కసారిగా.. ఆమె ప్రియుడికి గతంలో ఆమె వేరే ఎవరితోనే ఇక్కడకి వచ్చిందనే అనుమానం కలిగింది. అయితే లీ మాత్రం ఇదే మొదటిసారి ఈ హోటలకి రావడం అని మొత్తుకున్నా వినడు ప్రియుడు.
మరీ వైఫై ఎలా కనెక్ట్ అయ్యిందో వివరణ ఇమ్మంటే..చెప్పలేకపోతుంది ప్రియుడికి. అంతే బ్రేకప్ అంటూ ఆమెను నిర్థాక్షణ్యంగా వదిలేస్తాడు. ఇక దీంతో లీకి అసలు ఈ హోటల్ వైఫైకి తన ఫోన్ ఎలా కనెక్ట్ అయ్యిందో కనుక్కోవాలని భావించి..ఆ విషయమై క్షణ్ణంగా విచారిస్తుంది. లీ తాను గతంలో పనిచేసిన చాంగ్‌కింగ్‌లోని మరొక హోటల్‌కి అదే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు ఉండటాన్ని గుర్తిస్తుంది.
వెంటనే రీజన్ చెప్పేందుకు తన ప్రియుడిని సంప్రదించగా అతడు వినే స్థితిలో ఉండడు, పైగా చాట్ యాప్‌లో కూడా మాట్లాడేందుకు వీలు లేకుండా ఆమె అకౌంట్‌ని కూడా డిలీట్ చేశాడు. దాంతో ఆమె తన కథను ఒక స్థానిక వార్తా ఛానెల్‌లో వివరిస్తుంది. అలాగే మునపటి పని ప్రదేశంలో ఆ వైఫై--అలాగే ఈ హోటల్ వైఫ్‌కి ఎలా కనెక్ట్ అయ్యిందో రిపోర్టర్ సాయంతో సవివరంగా చెబుతుంది. ఇక ఇదంతా తనని నమ్మని వ్యక్తిన కలిసేందుకు ఈ వివరణ ఇవ్వడం లేదని, తనలా మరొకరు అపార్థాలకి బలవ్వకూడదని ఇలా చేశానని ఆమె బాధగా వివరించింది.
(చదవండి: ఆ హగ్ గుర్తొచ్చినప్పుడల్లా.. మనసు చివుక్కుమంటోంది! హృదయాన్ని కదిలించే పోస్ట్)