అది వీడ్కోలు అని తెలియక..! పాపం ఆ వ్యక్తి.. | Delhi Mans Emotional Post Remembering Late Wife Moves Internet | Sakshi
Sakshi News home page

ఆ హగ్‌ గుర్తొచ్చినప్పుడల్లా.. మనసు చివుక్కుమంటోంది! హృదయాన్ని కదిలించే పోస్ట్‌

May 12 2025 4:30 PM | Updated on May 12 2025 5:11 PM

Delhi Mans Emotional Post Remembering Late Wife Moves Internet

ఒక్కోసారి మన ఊహకే అందని విధంగా జరుగుతుంటాయి ఘటనలు. ఏదో పిడుగు అమాంతం పడ్డట్టుగా జీవితం పెద్ద కుదుపుకి గురవ్వుతుంది. ఆ ఘటన నుంచి తేరుకోవడానికే చాలా టైం పడుతుంది. పైగా అందులోంచి బయటపడతామని అనుకోం కూడా. అలాంటి పరిస్థితే ఎదురైంది ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తికి. గుర్తొచ్చినప్పుడల్లా..ఎంత పొరపాటు చేశాను అనే గిల్టీ ఫీలింగ్‌ వెన్నాడుతుందంటూ భావోద్వేగంగా పోస్ట్‌ పెట్టాడు. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

లింక్డ్‌ఇన్‌లో ఢిల్లీకి చెందిన ప్రతాప్‌ సుతాన్‌ అనే వ్యక్తి గుండెల్ని మెలిపెట్టేలా ఓ పోస్ట్‌ పెట్టాడు. తన చివరి హగ్‌ గురించి మాట్లాడారు. ఆ రోజు ఆ ఆలింగనం చాలా సాధారణమైనది గానీ, ఇప్పుడు తలుచుకున్నప్పుడల్లా గుండె బరువెక్కిపోతుందని వాపోయాడు. అస్సలు అలా జరుగుతుంనదని ఎవ్వరూ ఊహించలేరు అంటూ తాను ఎదుర్కొన్ని విషాదకర అనుభవాన్ని పంచుకున్నారు. 

ఒకరోజు తన భార్యకి బాగోలేదని ఆస్ప్రతికి తీసుకువెళ్తున్నాను. ఇంతలో వెళ్లే ముందు ఎప్పటిలానే ఆమెకు ఏం కాదని ధైర్యం చెబుతూ హగ్‌  చేసుకుని మరీ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. చాలా నార్మల్‌గా హగ్‌ చేసుకున్నాడు. కానీ అదే తాను తన భార్యకిచ్చే చివరి హగ్‌ అని గ్రహించలేకపోతాడు. ఆ రోజు ఆస్పత్రికి వెళ్లడం.. పరిస్థితి విషమించడం, చనిపోవడం అన్ని క్షణాల్లో తన కళ్లముందే జరిపోయాయి. 

అయితే అది నేను చివరి వీడ్కోలు అని తెలియక చాలా సాదాసీదాగా నా భార్యను కౌగలించుకన్నా. అది కూడా ..కేవలం ఆమెకి అంతా బాగానే ఉంటుందని ఆశను కలిగించే ఉద్దేశ్యంతో హగ్‌ చేసుకున్నదే. కానీ తన భార్య మాత్రం అదే చివరిసారి అని గ్రహించే ఉంది కాబోలు..అంటూ భావోద్వేగంగా పోస్ట్‌ పెట్టారు. అంతేగాదు ఎన్నోసార్లు నా భార్యను హగ్‌చేసుకున్నా..కానీ ఏది గుర్తుకు రాదు..కానీ ఈ ఆలింగనం..చచ్చేంతవరకు అంటిపెట్టుకునేలా మోస్తున్నా అని బాధగా అన్నారు. 

ఆ ఘటన గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణం పోతున్నంత బాధగా ఉంటుందన్నారు. మనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు లేదా మనం బాగా కనెక్ట్‌ అయ్యే వ్యక్తులు మిస్‌ అవ్వక ముందే ఒక్కసారి గాఢంగా హగ్‌ చేసుకోండని అన్నారు. అలాగే స్పర్శ శక్తిని గురించి కూడా వివరించారు.  ప్రేమ లేదా కోల్పోయిన వాటి స్థితిస్థాపకతను వ్యక్తపరిచేదీ ఈ కౌగలింతేనని అన్నారు. 

అవి ఎలా ఉంటాయంటే..వృద్ధ తల్లిదండ్రులు తమ బిడ్డను దగ్గరకి తీసుకోవడం, తల్లి తన కొడుకును యుద్ధానికి బయలుదేరే ముందు ప్రేమగా హగ్‌చేసుకోవడం, ప్రేమికులు చాలా కాలం విడిపోయిన తర్వాత తిరిగి కలుసుకునేటప్పుడూ లేదా నిరాశ క్షణాల్లో నిశ్శబ్ద బలాన్ని అందించేలా వెన్నుతడుతున్నట్లుగా దగ్గరగా చేరదీసి హగ్‌ చేసుకోవడం వంటివని అన్నారు. 

చివరిగా తన భార్య తన నుంచి దూరమైపోతుందని తెలియక..హగ్‌ చేసుకున్న ఘటన జీవితాంత మర్చిపోలేనని, తాను ఉన్నంత వరకు మధురమైన జ్ఞాపకమే అని అన్నారు సుతాన్‌ పోస్ట్‌లో. అయితే నెటిజన్లుంతా చాలా మంచి పోస్ట్‌ పెట్టారు..ఒక  కౌగిలింత జీవితాంతం భావోద్వేగాలను నిలుపుకోగలదని గుర్తుచేయడమేగాక, ముఖ్యమైన బంధాలకు ప్రాముఖ్యత ఇవ్వాలనేది హైలెట్‌ చేశారని ప్రశంసిస్తూ.. పోస్ట్‌లు పెట్టారు. 

(చదవండి: రోజూ బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్‌ తింటున్నారా..? అంబానీ, సచిన్‌ల హెల్త్‌ కోచ్‌ షాకింగ్‌ విషయాలు)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement