గులాబీ రేకులతో స్వీట్‌ : బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు | Sakshi
Sakshi News home page

గులాబీ రేకులతో స్వీట్‌ : బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు

Published Tue, Apr 16 2024 3:09 PM

Chek these Health Benefits Of Gulkand Or Rose Petal Jam - Sakshi

గులాబీ పువ్వులు సౌందర్య పోషణ  ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తాయి.  గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కంద్  వలన  అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేదం చెబుతోంది.గుల్కంద్ అనే పదం గుల్ నుండి వచ్చింది. దీని అర్థం పెర్షియన్ భాషలో 'పువ్వు'  అరబిక్‌లో 'కంద్' అంటే 'తీపి'. ముఖ్యంగా ఈ వేసవిలో గులాబీ రేకుల జామ్ లేదా గుల్కంద్  వల్ల ఒంటికి చలవ చేస్తుంది.  దీన్ని  ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.  ఫిట్‌గా ఉంచే అద్భుతమైన టానిక్‌లా పనిచేసే గుల్కంద్‌ ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు.. లభించే ఆరోగ్య ప్రయోజనాల  గురించి తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు
శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గులాబీ రేకులు
వెడల్పుమూత ఉన్న గాజు సీసా, లేదా జార్‌ 
యాలకులు 

గులాబీ రేకులను బాగా  ఎండబెట్టాలి. ఎండిన వాటిని ఒక గాజు సీసాలో వేసి, దానికి  కొద్దిగా చక్కెర,  యాలకుల పొడి కలుపుకోవాలి.   గాజు  సీసాను ప్రతిరోజూ దాదాపు ఏడు గంటలపాటు ఎండలో ఉంచాలి. మళ్లీ రాత్రికి చెక్క స్పూన్‌తో లేదా తడిలేని  గరిటెతో  బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా దాదాపు నెల రోజుల పాటు ఇలా చేయాలి. దీంతో జామ్‌లాగా ఇది తయారవుతుంది. దీన్ని పలు రకాల స్వీట్లలో వాడతారు. అలాగే ఫ్రూడ్‌ సలాడ్లలో వాడవచ్చు. కాస్త చల్లటి పాలు తీసుకుని అందులో ఒక చెంచా గుల్కంద్ వేసి తాగవచ్చు.
అలాగే దీన్ని  నేరుగా లేదా తమలపాకులతో కూడా  తినవచ్చు.

అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

 • శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఈ గులాబీ గుల్కంద్‌
 • ఆయుర్వేద ప్రకారం పిత్త దోషాలకు చాలా మంచిది. వేడిని పుట్టిస్తుంది. చల్లగా ఉండేలాగా కూడా పనిచేస్తుంది
 • దద్దుర్లు, నొప్పులు ,నొప్పులు వంటి వేడి-సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది ,
 •  అరికాళ్ళు  అరచేతులలో ఏవైనా మంటలను తగ్గిస్తుంది.
 • జ్ఞాపకశక్తి కంటి చూపును మెరుగుపరుస్తుంది   ఇది కాలక్రమేణా కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
 • జీర్ణక్రియకు సహాయపడుతుంది.  అందుకే దీన్ని తాంబూలంలో కూడా ఎక్కువగా వాడతారు.
 • రక్తహీనతను నివారిస్తుంది, హిమోగ్లోబిన్ తక్కువగా  ఉన్నవారికి ఇది చాలా మంచిది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది
 •  కప్పు పాలలో వేసి రాత్రిపూట తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది
 • చర్మం త్వరగా ముడతలు పడకుండా నివారిస్తుంది.  మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది.
 • గుల్కంద్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్రమైన అల్సర్‌లు, మలబద్ధకం, గుండె మంట సమస్యలకు  ఉపశమనం కలుగుతుంది.
 • వేసవిలో గుల్కంద్ వాడటం వల్ల వడదెబ్బ, ముక్కు కారటం, తలతిరగడం వంటివి నివారించవచ్చు.
 • బహిష్టు సమయంలో అధిక రక్తస్రావానికి గుల్కంద్ మంచిది.
 • ముఖ్యంగా పీసీఓడీతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది.
 • థైరాయిడ్‌తో బాధపడేవారు కూడా ఈ జామ్‌ని చక్కగా తీసుకోవచ్చు

 
 

Advertisement
 
Advertisement