
నటి, ఉద్యమకారిణి, మానవతావాది... ఎమ్మా వాట్సాన్. ఒక్క ముక్కలో చెప్పాలంటే... పవర్‌ఫుల్ ఉమన్. ‘లింగ సమానత్వం’ కోసం ‘హర్‌ఫర్ షీ’ క్యాంపెయిన్ నిర్వహించింది. ‘మా ఉద్యమంలో మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా భాగం కావాలి’ అని ‘హర్ ఫర్ షీ’ ఉద్యమం పిలుపు ఇచ్చింది.
స్త్రీ స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం, జెండర్ స్టీరియోటైప్స్‌ను బ్రేక్ చేయడం... మొదలైన లక్ష్యాలతో ‘హర్ షీమూమెంట్’ పనిచేసింది. ‘నేను స్త్రీవాదిని’ అని గర్వంగా చెప్పుకునే ఎమ్మా స్త్రీవాదాన్ని పునర్నిర్వచించాలని చెబుతుంది. పురుషులను ద్వేషించడమే లక్ష్యంగా కాకుండా వివాదరహితంగా స్త్రీవాద ఉద్యమం ఉండాలని కోరుకుంటుంది.
తన ఉద్యమ కార్యాచరణ ద్వారా ఎంతోమంది పురుషులను ప్రభావితం చేసింది ఎమ్మా. యూఎన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆమె చేసిన ఉపన్యాసం వైరల్ అయింది. యూఎన్ అంబాసిడర్‌గా బంగ్లాదేశ్, జాంబియాలలో ఆడపిల్లల చదువుకు సంబంధించి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టింది. మహిళల హక్కుల కోసం, స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా 30 సంస్థలతో కలిసి పనిచేసింది.
పారిస్‌లో జన్మించిన ఎమ్మా వాట్సన్ ఇంగ్లాండ్‌లోని ‘ది యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్’లో చదువుకుంది. టైమ్ మ్యాగజైన్ ‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ది వరల్డ్’ జాబితాలో చోటు సాధించింది.
(చదవండి: ఫ్యామిలీతో వెళ్లాలంటే బిజినెస్ క్లాస్ వద్దు..! వైరల్‌గా సీఈవో పోస్ట్..)