
మెదడుకు మేత
కొన్ని రకాల ఆహారాన్ని తరచు పిల్లలకు తినిపించడం వల్ల వారిలో మేధోవికాసం పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఆరోగ్యంతో పాటు తెలివితేటలను పెంచే సూపర్ ఫుడ్స్ కూడా ఇస్తూ ఉండాలి.
వేరుశనగ.. ఇందులో ధయామిన్‌తోపాటు విటమిన్ ఇ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉండటం వల్ల పిల్లల్లో మెదడు ఎదుగుదలకు కావలసిన శక్తి అంది, చక్కగా పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
వోట్స్.. పిల్లల కోసం ఆరోగ్యాన్ని అందించే తృణధాన్యాలలో మొదటిది వోట్స్. ఇది మెదడుకు ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తుంది. ఓట్స్ లోని పీచుపదార్థం పిల్లల మెదడుకు మంచి ఇంధనంగా పనిచేస్తుంది. పొటాషియం, జింక్, విటమిన్ ఇ, బి వారి పెరుగుదలకు సహకరిస్తాయి.
బెర్రీలు.. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్ ఇవి రకరకాల రంగులలో ఎక్కువ పోషకాలను కలిగి ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బీన్స్.. బీన్స్ ప్రత్యేకమైనవి. ప్రొటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ శక్తితో పాటు విటమిన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. మానసికమైన సామర్థ్యాన్ని ఇస్తాయి. మెదడుకు బీన్స్ పింటో బీన్స్ ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యం కోసం చక్కగా పనిచేస్తాయి.
ఇదీ చదవండి: నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!