
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో బాల్ పాయింట్ పెన్‌ను ‘బిరో’ అని పిలుస్తారు. బాల్ పాయింట్ పెన్‌ను తయారుచేసిన వ్యక్తి బీరో. హంగేరియన్ జర్నలిస్ట్ అయిన లజ్లో బీరో 1845లో బాల్ పాయింట్ పెన్‌ను తయారు చేశాడు.
జిరాఫీలకు ‘నిశ్శబ్ద జీవులు’గా పేరు. కమ్యూనికేషన్ కోసం బాడీ లాంగ్వేజ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తాయి. బాడీ లాంగ్వేజ్ ద్వారా మాత్రమే కాదు రాత్రి పూట గొణుక్కోవడం, కొన్ని రకాల శబ్దాల ద్వారా కమ్యూనికేషన్ చేస్తాయి.
‘కలర్ సైకాలజీ’ ప్లేయర్స్ ఆట తీరుపై ప్రభావం చూపుతుందా?
‘యస్’ అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. రెడ్ కలర్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. రెడ్ యూనిఫామ్ ధరించిన ఫుట్‌బాల్ టీమ్‌ల సక్సెస్‌రేట్ ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం తెలియజేసింది.
ఒకప్పుడు మిలిటరీ యాక్సెసరీగా మాత్రమే ఉన్న ‘టై’ ఆ తరువాత కాలంలో స్టేటస్ సింబల్‌గా మారింది. నిజానికి నెక్ టైలకు ‘క్రోవట్స్’ అని పేరు. క్రోయేషియన్ సైనికులు ధరించడం వల్ల అలా పిలిచేవారు. క్రోవటికా ఆర్గనైజేషన్ సభ్యులు 2,650 అడుగుల ‘టై’ తయారుచేసి రికార్డ్ సృష్టించారు