breaking news
Ball point pen
-
"బాల్‌పాయింట్ పెన్" రూపొందించింది ఓ 'జర్నలిస్ట్’ అని తెలుసా..?
మన జేబులో ఒదిగిపోయే ఒక చిన్న వస్తువు ప్రపంచ రూపురేఖలను మార్చేస్తుందని ఎవరైనా ఊహించారా..? స్కూల్ బ్యాగుల నుంచి ఆఫీస్ డెస్క్‌ల వరకు ప్రతిచోటా దర్శనమిచ్చే 'బాల్‌పాయింట్ పెన్' వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నిత్యం మనం రాసేందుకు ఉపయోగించే ఈ చవకైన సాధనం, ఒక జర్నలిస్ట్ పడిన చిన్న ఇబ్బంది, ఆయన చేసిన సునిశిత పరిశీలనల నుంచే పుట్టుకొచ్చింది.ఒకప్పుడు రాయడం అంటే అంత సులువైన విషయం కాదు. బాల్‌పాయింట్ పెన్నులు రాకముందు ప్రపంచమంతా 'ఫౌంటెన్ పెన్నుల'పైనే ఆధారపడేది. అవి చూడటానికి ఎంతో రాజసంగా, అందంగా ఉండేవి కానీ, వాటితో ఉన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఆ పెన్నుల నిబ్ గుండా సిరా సజావుగా ప్రవహించాలంటే, సిరా చాలా పలుచగా, నీళ్లలా ఉండాలి. దీనివల్ల కాగితంపై రాయగానే సిరా త్వరగా ఆరేది కాదు. కాస్త చేయి తగిలినా లేదా పేజీ తిప్పినా అక్షరాలన్నీ చెరిగిపోయి, కాగితం మొత్తం నల్లటి మరకలతో మురికిగా మారిపోయేది.లాస్లో బీరో అనే జర్నలిస్ట్..ముఖ్యంగా వార్తా సంస్థల్లో అత్యంత వేగంగా నోట్స్ రాసుకోవాల్సిన పాత్రికేయులకు ఈ సిరా ఒలికిపోవడం, మరకలు పడటం అనేది ఒక పెద్ద చికాకుగా మారేది. హంగేరీకి చెందిన లాస్లో బీరో అనే జర్నలిస్ట్ కూడా ప్రతిరోజూ ఇదే సమస్యతో విసిగిపోయారు. అయితే, 1938లో ఒకరోజు ఆయన న్యూస్‌రూమ్‌లో కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. పెద్ద పెద్ద రొటేటరీ మిషన్లపై ముద్రితమై వస్తున్న వార్తాపత్రికలలోని సిరా తక్షణమే ఆరిపోతోంది. పత్రికను పట్టుకున్నా చేతులకు నల్లటి మరకలు అంటడం లేదు. కానీ, తన ఫౌంటెన్ పెన్ సిరా మాత్రం చాలా సేపటి వరకు తడిగానే ఉంటోంది."వార్తాపత్రికల ముద్రణకు ఉపయోగించే సిరా అంత త్వరగా ఎలా ఆరిపోతోంది..?" అనే చిన్న ప్రశ్న బీరో మైండ్‌లో ఒక పెద్ద ఆలోచనకు పునాది వేసింది. వార్తాపత్రికల్లో వాడే సిరా వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు బీరో పరిశోధనలు ప్రారంభించారు. ఆ సిరా చాలా చిక్కగా ఉండటం వల్లే కాగితం దాన్ని త్వరగా పీల్చుకుంటుందని, ఫలితంగా అది వెంటనే ఆరిపోతుందని గ్రహించారు. అయితే, ఆ చిక్కటి సిరాను నేరుగా తన ఫౌంటెన్ పెన్నులో పోసి రాయడానికి ప్రయత్నించినప్పుడు మరో సమస్య ఎదురైంది.సిరాను మార్చితే..చిక్కదనం వల్ల ఆ సిరా పెన్ నిబ్‌ను పూర్తిగా మూసివేసింది. అంటే, కేవలం సిరాను మార్చితే సరిపోదు, రాయడానికి వాడే పరికరం సాంకేతికతను పూర్తిగా మార్చాలని బీరో నిర్ణయించుకున్నారు. సిరా ప్రవాహాన్ని నియంత్రించడానికి బీరో ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. పెన్ కొన భాగంలో నిబ్‌కు బదులుగా, స్వేచ్ఛగా తిరగగలిగే ఒక చిన్న లోహపు బంతిని (Tiny Rotating Ball) అమర్చారు. పెన్నును కాగితంపై పెట్టి రాస్తున్నప్పుడు, ఆ బంతి గుండ్రంగా తిరుగుతుంది. అలా తిరిగినప్పుడు పెన్ లోపల ఉన్న గొట్టం (కార్ట్రిడ్జ్) నుంచి చిక్కటి సిరాను ఆ బంతి తన వైపుకు తీసుకుంటుంది. బాల్ తర్వాతి రౌండ్ తిరగగానే ఆ సిరాను కాగితంపైకి సున్నితంగా రాస్తుంది. ఈ చిన్న బాల్ ఐడియా ఒకేసారి అన్ని సమస్యలనూ పరిష్కరించే సింది. ఇది సిరా లీక్ అవ్వకుండా అడ్డుకుంది, ప్రవాహాన్ని నియంత్రించింది, అన్నింటికీ మించి త్వరగా ఆరిపోయే చిక్కటి సిరాను ఉపయోగించేలా చేసింది.ప్రపంచంలోనే మొట్టమొదటి..ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి విజయవంతమైన బాల్‌పాయింట్ పెన్..! బాల్‌పాయింట్ పెన్ సిరా ప్రత్యేక రసాయన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇది పెన్ను లోపల ఉన్నంత కాలం ఎండిపోకుండా స్థిరంగా ఉంటుంది, కానీ కాగితాన్ని తాకగానే గాల్లోని తేమను గ్రహించి తక్షణమే ఆరిపోతుంది.లాస్లో బీరో తన వ్యక్తిగత చికాకును దూరం చేసుకోవడానికి కనుగొన్న ఈ చిన్న పరికరం, కొద్ది కాలంలోనే ప్రపంచవ్యాప్త వ్రాత అలవాట్లను మార్చేసింది. ఫౌంటెన్ పెన్నుల లాగా వీటికి పదే పదే సిరా సీసాల నుంచి ఇంక్ నింపాల్సిన అవసరం లేదు, లీక్ అవుతుందనే భయం లేదు. ఎక్కువ కాలం మన్నిక రావడం, ధర కూడా చాలా తక్కువగా ఉండటంతో ఇవి పాఠశాలలు, బ్యాంకులు, ఆఫీసులకు వేగంగా విస్తరించాయి. ఈ రోజు మన చేతిలో ఎంతో సులభంగా కదలాడే బాల్ పెన్ వెనుక ఒక జర్నలిస్ట్ సృజనాత్మకత, నిశిత పరిశీలన దాగి ఉన్నాయి. చిన్న చిన్న ఇబ్బందులే కొన్నిసార్లు ప్రపంచాన్ని మార్చే గొప్ప ఆవిష్కరణలకు దారితీస్తాయని చెప్పడానికి లాస్లో బీరో కథే ఒక నిలువెత్తు నిదర్శనం..!- పసుపులేటి వెంకటేశ్వరరావు. (చదవండి: తొమ్మిదేళ్లకే ప్రపంచ గుర్తింపు..! ఏకంగా ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఆహ్వానం ..) -
అవును నిజమే! ఇవిగో ఫ్యాక్ట్స్
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో బాల్ పాయింట్ పెన్ను ‘బిరో’ అని పిలుస్తారు. బాల్ పాయింట్ పెన్ను తయారుచేసిన వ్యక్తి బీరో. హంగేరియన్ జర్నలిస్ట్ అయిన లజ్లో బీరో 1845లో బాల్ పాయింట్ పెన్ను తయారు చేశాడు.జిరాఫీలకు ‘నిశ్శబ్ద జీవులు’గా పేరు. కమ్యూనికేషన్ కోసం బాడీ లాంగ్వేజ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తాయి. బాడీ లాంగ్వేజ్ ద్వారా మాత్రమే కాదు రాత్రి పూట గొణుక్కోవడం, కొన్ని రకాల శబ్దాల ద్వారా కమ్యూనికేషన్ చేస్తాయి.‘కలర్ సైకాలజీ’ ప్లేయర్స్ ఆట తీరుపై ప్రభావం చూపుతుందా? ‘యస్’ అంటున్నాయి కొన్ని అధ్యయనాలు. రెడ్ కలర్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. రెడ్ యూనిఫామ్ ధరించిన ఫుట్‌బాల్ టీమ్‌ల సక్సెస్‌రేట్ ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనం తెలియజేసింది. ఒకప్పుడు మిలిటరీ యాక్సెసరీగా మాత్రమే ఉన్న ‘టై’ ఆ తరువాత కాలంలో స్టేటస్ సింబల్‌గా మారింది. నిజానికి నెక్ టైలకు ‘క్రోవట్స్’ అని పేరు. క్రోయేషియన్ సైనికులు ధరించడం వల్ల అలా పిలిచేవారు. క్రోవటికా ఆర్గనైజేషన్ సభ్యులు 2,650 అడుగుల ‘టై’ తయారుచేసి రికార్డ్ సృష్టించారు -
ఆవిష్కరణం: బాల్ పాయింట్ పెన్
ఓ ఇంక్ బాటిల్ పక్కన పెట్టుకుని ఓ ఈక తీసుకుని అందులో ముంచి తీసి రాసుకునేవాళ్లు ఒకప్పుడు.. అది పాతబడిపోయింది! తర్వాత పెన్నులోకి ఇంక్ పిల్లర్‌తో ఇంక్ పోసుకుని దాంతో రాసుకునేవాళ్లు! ఇది కూడా పోయింది! తర్వాత వచ్చింది అద్భుతమైన ఓ రాత పరికరం! అదే బాల్ పాయింట్ పెన్! ఇంకు అద్దుకోవడాల్లేవు.. పోసుకోవడాల్లేవు.. ఇలా క్యాప్ తీసి, అలా రాసుకోవడమే! రాతను ఎంతో సులభతరం చేసిన బాల్ పాయింట్ 19వ శతాబ్దపు అత్యద్భుత ఆవిష్కరణల్లో ఒకటి. ఆ ఘనత హంగేరీకి చెందిన బిరో జోసెఫ్ శాస్త్రవేత్తది. ఈయన జాన్ లౌడ్ అనే తోలు వ్యాపారి కోసం బాల్‌పాయింట్ పెన్ తయారు చేశారు. తన తోలు ఉత్పత్తులపై రాయడానికి ఇంకు పెన్నులు పనికి రాకపోవడంతో ఏదైనా కొత్త తరహా పెన్ను తయారు చేయాలని కోరడంతో జోసెఫ్ బాల్‌పాయింట్ పెన్ను రూపొందించారు. 1888లో దీనికి పేటెంట్ లభించింది. అయితే, ఇంకు పెన్నులోకి పోసినప్పుడు పలుచటి ఇంకు కారిపోయేది. మరీ మందంగా ఉంటే గడ్డకట్టిపోయేది. దీంతో పాటు వాతావరణాన్ని బట్టి సిరా స్వభావం మారేది. లౌడ్ పేటెంట్ పొందాక ఎంతోమంది పేటెంట్ పొందారు. కానీ అవేమీ వర్కవుట్ అవలేదు. 1935లో హంగరీకి చెందిన బైరో, జార్జ్ (అన్నదమ్ములు) కనిపెట్టిన బాల్ పాయింట్ విత్ స్పాంజ్మెటల్ కొంతవరకు కాస్త మెరుగ్గా ఉంది. కానీ... అది ఫైనల్ కాదు. 1952లో మార్సెల్ బిచ్ మార్కెట్లోని బాల్ పాయింట్ పెన్నులన్నింటిపై రీసెర్చి చేసి వాటిలో బైరో-జార్జిలదే మెరుగైనది కనిపెట్టాడు. వాళ్ల పేటెంట్ కొనుక్కుని మళ్లీ దానిపైపరిశోధన చేసి మెరుగుపరిచి ప్రస్తుతం మనం రాస్తున్న పెన్ను రూపంలోకి తెచ్చాడు. అది మార్కెట్లోకి వచ్చిన స్వల్పకాలంలో జనాదరణ పొందింది. కోట్ల కొద్దీ పెన్నులు తయారై, ప్రపంచం నలుమూలలకూ విస్తరించాయి.


