ఆవిష్కరణం: బాల్ పాయింట్ పెన్ | Ball point Pen: Ink Pillar | Sakshi
Sakshi News home page

ఆవిష్కరణం: బాల్ పాయింట్ పెన్

Sep 29 2013 2:40 AM | Updated on Sep 1 2017 11:08 PM

ఆవిష్కరణం: బాల్ పాయింట్ పెన్

ఆవిష్కరణం: బాల్ పాయింట్ పెన్

ఓ ఇంక్ బాటిల్ పక్కన పెట్టుకుని ఓ ఈక తీసుకుని అందులో ముంచి తీసి రాసుకునేవాళ్లు ఒకప్పుడు.. అది పాతబడిపోయింది! తర్వాత పెన్నులోకి ఇంక్ పిల్లర్‌తో ఇంక్ పోసుకుని దాంతో రాసుకునేవాళ్లు!

ఓ ఇంక్ బాటిల్ పక్కన పెట్టుకుని ఓ ఈక తీసుకుని అందులో ముంచి తీసి రాసుకునేవాళ్లు ఒకప్పుడు.. అది పాతబడిపోయింది! తర్వాత పెన్నులోకి ఇంక్ పిల్లర్‌తో ఇంక్ పోసుకుని దాంతో రాసుకునేవాళ్లు! ఇది కూడా పోయింది! తర్వాత వచ్చింది అద్భుతమైన ఓ రాత పరికరం! అదే బాల్ పాయింట్ పెన్!
 
 ఇంకు అద్దుకోవడాల్లేవు.. పోసుకోవడాల్లేవు.. ఇలా క్యాప్ తీసి, అలా రాసుకోవడమే! రాతను ఎంతో సులభతరం చేసిన బాల్ పాయింట్ 19వ శతాబ్దపు అత్యద్భుత ఆవిష్కరణల్లో ఒకటి. ఆ ఘనత హంగేరీకి చెందిన బిరో జోసెఫ్ శాస్త్రవేత్తది. ఈయన జాన్ లౌడ్ అనే తోలు వ్యాపారి కోసం బాల్‌పాయింట్ పెన్ తయారు చేశారు. తన తోలు ఉత్పత్తులపై రాయడానికి ఇంకు పెన్నులు పనికి రాకపోవడంతో ఏదైనా కొత్త తరహా పెన్ను తయారు చేయాలని కోరడంతో జోసెఫ్ బాల్‌పాయింట్ పెన్ను రూపొందించారు. 1888లో దీనికి పేటెంట్ లభించింది. అయితే, ఇంకు పెన్నులోకి పోసినప్పుడు పలుచటి ఇంకు కారిపోయేది. మరీ మందంగా ఉంటే గడ్డకట్టిపోయేది.
 
 దీంతో పాటు వాతావరణాన్ని బట్టి సిరా స్వభావం మారేది. లౌడ్ పేటెంట్ పొందాక ఎంతోమంది పేటెంట్ పొందారు. కానీ అవేమీ వర్కవుట్ అవలేదు. 1935లో హంగరీకి చెందిన బైరో, జార్జ్ (అన్నదమ్ములు) కనిపెట్టిన బాల్ పాయింట్ విత్ స్పాంజ్‌మెటల్ కొంతవరకు కాస్త మెరుగ్గా ఉంది. కానీ... అది ఫైనల్ కాదు. 1952లో మార్సెల్ బిచ్ మార్కెట్లోని బాల్ పాయింట్ పెన్నులన్నింటిపై రీసెర్చి చేసి వాటిలో బైరో-జార్జిలదే మెరుగైనది కనిపెట్టాడు. వాళ్ల పేటెంట్ కొనుక్కుని మళ్లీ  దానిపైపరిశోధన చేసి మెరుగుపరిచి ప్రస్తుతం మనం రాస్తున్న పెన్ను రూపంలోకి తెచ్చాడు. అది మార్కెట్లోకి వచ్చిన స్వల్పకాలంలో జనాదరణ పొందింది. కోట్ల కొద్దీ పెన్నులు తయారై, ప్రపంచం నలుమూలలకూ విస్తరించాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement