
నేడు వరల్డ్ మస్కిటో డే
ప్రపంచ వ్యాప్తంగా దోమల నివారణ పెద్ద సమస్యగా మారింది. దోమల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధి మలేరియా. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక మరణం సంభవిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా మలేరియా నియంత్రణలో కష్టించి సాధించిన ప్రగతి ఇప్పుడు ప్రమాదంలో పడి, ముందుకు సాగలేని పరి స్థితి వచ్చింది. వాతావరణం, సామాజిక సంఘర్షణలు, ఆర్థిక స్థితి గతులు, అత్యవసర పరిస్థితులు దీనికి అడ్డంకులుగా మారుతు న్నాయి. అందువలన మలేరియా నియంత్రణ ప్రాథమిక సూత్రాలైన గుర్తింపు, చికిత్స, నివారణ చర్యలు అందుబాటులో ఉండటం లేదు. నిరూపితమైన నివా రణ చర్యల కోసం తిరిగి పెట్టుబడి పెట్టడం, అడ్డంకులను తొలగించు వ్యూహా లను పన్నడం, కలసికట్టుగా తిరిగి అందరూ ఈ కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టడం ద్వారా మలేరియాను అంతం చేయవచ్చు.
2000 – 2017 మధ్య 180 దేశాల మలే రియా, స్థూల దేశీయోత్పత్తు (జీడీపీ)ల డేటాలను విశ్లేషించినప్పుడు... మలేరియా సంభవం 10% తగ్గినప్పుడు తలసరి జీడీపీలో సగటున 0.3% పెరుగుదల ఉందని తేలింది. ప్రతి దేశం మలేరి యాను నివారించడానికీ, గుర్తించడానికీ, చికిత్స చేయడానికీ ఒక కొంగొత్త సాంకేతికతను వాడుతున్నాయి. దోమల జీవిత కాలాన్నీ, అవి మలేరియాను వ్యాప్తి చేసే సామర్థ్యాన్నీ తగ్గించడానికి పురుగు మందులతో కూడిన దోమ తెరల సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 2000లో ఈ సాంకేతికతను విస్తరించినప్పటి నుండి 68 శాతం మలేరియా కేసులను నివారించినట్లు అంచనా. ‘కాలానుగుణ మలేరియా చికిత్స’ పొందిన పిల్లలలో దాదాపు 75 శాతం మలేరియా బారి నుంచి బయటపడ్డారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీర్ఘకాలం ఉండే దోమ తెరలు, మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స, శక్తిమంతమైన కొత్త వాహక నియంత్రణ సాధనాలు, జన్యుపరంగా మార్పు చెందిన దోమలు, ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలపై పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా
Even mosquitoes are worried! 🦟
With clean surroundings, covered tanks, and repellents in every home, they have nowhere to hide. This World Mosquito Day, let’s keep our communities safe and mosquito-free.#WorldMosquitoDay #FightTheBite pic.twitter.com/ydoux9ZrwO— Ministry of Health (@MoHFW_INDIA) August 20, 2025
అందువలన గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ దేశాలు మలేరియా నిర్మూ లనకు దగ్గరగా ఉన్నాయి. మన దేశంలో గత సంవత్సరం 2,57,383 మలే రియా కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ఆవాసాలు, కొండ ప్రాంతాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమో దవుతూ ఉన్నాయి. అక్కడ జనాభా 20% మాత్రమే ఉన్నప్పటికీ, 80% కేసులు అక్కడే ఉన్నాయి. మనందరం కలిసి మలేరియాను సమూలంగా తొలగించేందుకు కంకణం కట్టుకుందాం. ఇది మన సమష్టి బాధ్యత.
– తలతోటి రత్న జోసఫ్, మెడికల్ ఎంటమాలజిస్ట్