
ఆకట్టుకునే సౌందర్యానికి మృదువైన చర్మంతో పాటు ఎద ఆకృతి అవసరమే అని నమ్ముతారు చాలామంది మహిళలు. అలాంటి వారి కోసమే ఈ ‘బ్రెస్ట్ ఎన్‌హాన్సర్ మసాజర్ బ్రా’! పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత, వయసు పెరుగుతున్న క్రమంలో వక్షోజాల్లో వచ్చే మార్పులను సరి చేసుకోవడానికి ఈ డివైస్ సహకరిస్తుంది. ఈ మసాజర్ చార్జింగ్ బేస్, పవర్ అడాప్టర్‌లతో పాటుగా లభిస్తుంది. దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా మసాజ్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు.
ఇది చాలా స్పీడ్ మోడ్స్‌తో పని చేయగలదు. దాంతో వినియోగదారులు నచ్చిన విధంగా మసాజ్ వేగాన్ని సర్దుబాటు చేసుకోగలరు. ఈ డివైస్ ముందువైపు ఆన్, ఆఫ్ బటన్స్ ఉంటాయి. చిత్రంలో ఉన్న ఈ ఎలక్ట్రిక్ చెస్ట్ మసాజర్– మృదువైన సిలికాన్ హెడ్స్‌తో చర్మానికి ఎలాంటి హాని కలిగించని విధంగా రూపొందింది. అలాగే ఇది వాటర్‌ప్రూఫ్ డిజైన్ కావడంతో వీటిని శుభ్రపరచుకోవడం కూడా సులభమే. దీనిలో వార్మింగ్ ఆప్షన్ కూడా ఉంది. దాంతో దీన్ని పీరియడ్స్ సమయంలో కూడా ఉపయోగించుకోవచ్చు.
దాని వల్ల ఆ సమయంలో వచ్చే కడుపునొప్పి తీవ్రత తగ్గుతుంది. ఈ డివైస్ రొమ్ము కణజాలాలను ఉత్తేజపరుస్తుంది. దాంతో ఆ భాగం ఆరోగ్యవంతంగా మారుతుంది. అలాగే ఈ మసాజర్‌తో స్త్రీలు తమ ఫిట్‌నెస్‌కు తగినవిధంగా చక్కటి పరిమాణాన్ని, ఆకృతిని పొందవచ్చు. కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి సొంతం చేసుకోవచ్చు. ఈ డివైస్ ఎవరికి తగ్గట్టుగా వాళ్లు అడ్జట్స్ చేసుకునే వీలుంటుంది. అందుకు అనువైన విధంగా, బ్రా వెనుకవైపు హుక్ స్ట్రిప్ ఉంటుంది. దాంతో దీన్ని టైట్‌గా లేదా లూజ్‌గా ధరించొచ్చు. క్వాలిటీని బట్టి, మోడల్స్‌ని బట్టి ఈ మెషిన్ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
కళాకాంతులు సొంతం
‘చర్మానికి తేమను అందించి, పొడిబారకుండా కాపాడుకోవాలంటే గాల్వానిక్ క్లీన్–అప్ ఫేషియల్ చేయించుకుంటే మేలు’ అంటున్నారు చాలామంది బ్యూటీషియన్స్. ఇది ఒక అధునాతన పద్ధతి.
సాధారణ ఫేషియల్స్ కంటే లోతైన శుభ్రతను, మెరుగైన పోషణను అందిస్తుంది. ఈ ప్రక్రియను కొన్నిరకాల ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ సాయంతో చేస్తారు. దీనిలో డిసిన్‌క్రస్టేషన్, అయోంటోఫోరెసిస్ అనే రెండు ప్రక్రియలు ఉంటాయి. మొదటి ప్రక్రియలో చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి దుమ్ము, ధూళి, జిడ్డు, మృతకణాలను తొలగిస్తారు. రెండవ ప్రక్రియలో పోషకాలు సమృద్ధిగా ఉన్న సీరమ్‌లను చర్మానికి పట్టిస్తారు.
ఇంకా ఈ ఫేషియల్‌తో రక్త ప్రసరణ మెరుగై, చర్మం కాంతిమంతంగా మారుతుంది. మొటిమలు, బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి. చర్మం బిగుతుగా మారి, ముడతలు తగ్గుతాయి. నిపుణుల పర్యవేక్షణలోనే ఈ చికిత్స జరగడం సురక్షితం. గర్భవతులు, చర్మ సమస్యలు ఉన్నవారు ఈ ఫేషియల్‌కి దూరంగా ఉండాలి.