
ఇటీవలికాలంలో వివాహ తీరుతెన్నుల్లో చాలా మార్పులొచ్చాయి. తమ జీవితంలో ముఖ్యమైన క్షణాలను అపురూపంగా దాచుకునేందుకు ఎంతఖర్చుకైనా వెనుకాడని వారు,స్థాయికి మంచి ఖర్చుచేస్తున్నవారు కొందరైతే, అత్యంత సాదాసీదాగా పెళ్లిళ్లు చేసుకొని, కొంత పొమ్మును దాతృత్వ సేవలకు వెచ్చిస్తున్నవారు కొందరు. ఇవన్నీ ఒకెత్తు అయితే, తామెలా ఉన్నా, ఆత్మన్యూనతకు గురికుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు ఈ తరం జంటలు. ఆత్మస్థైర్యంతో తమ వ్యక్తిత్త్వాన్ని చాటుకుంటున్నారు. పురాతన స్టీరియోటైప్ అభిప్రాయాలనుంచి బయటపడి, సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్‌తో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఆసక్తికరమైన వధువు గురించి తెలుసుకుందాం.
నల్లగా వున్నా, లావుగా ఉన్నా, తెల్ల జుట్టు ఉన్నా, ఆడవాళ్లకు మీసాలు గడ్డాలు వచ్చినా, మగవాళ్లకు బట్ట తల ఉన్నా.. అదేదో లోపం లాగా ఆత్మన్యూనతతో బాధపడుతూ కూర్చోవడంలేదు. ఎలా ఉన్నా మనల్ని మనల్ని యథాతథంగా స్వీకరించడం, మనల్ని మనం ప్రేమించుకోవడం అవగాహన కూడా పెరుగుతోంది. భారత దేశానికి చెందిన మైత్రి జొన్నల నెరిసి తెల్ల జుట్టుతో ధైర్యంగా పెళ్లి పీటలెక్కి తన వ్యక్తిత్వాన్ని చాటుకుంది. పెళ్లి కూతురు అంటే ఇలాగే ఉండాలి అనే సాంప్రదాయపు గోడల్ని బద్దలు కొట్టింది. సహజ సౌందర్యంతో, ఆనందంగా తన చిరకాల ప్రియుడు పార్త్‌ను గత ఏడాది వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట సందడిగా మారాయి.

అమ్మనుంచి వచ్చిన గిఫ్ట్
ఈ సందర్భంగా మైత్రి సాల్ట్ అండ్ పెప్పర్ జుట్టు తల్లితో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది.తన జుట్టు గురించి సిగ్గుపడటం లేదా భయపడటం లేదని వెల్లడించింది. తన తల్లికి కూడా 30 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా బూడిద రంగులోకి మారిపోయిందనీ, ఎవరెన్ని ఉచిత సలహాలిచ్చినా, తన సహజ జుట్టును అలాగే ఉంచుకుందని గుర్తు చేసుకుంది. ఆమే తనకు స్ఫూర్తి అని ఆత్మవిశ్వాసంతో తెలిపింది.
"నా బూడిద జుట్టు నన్ను భయపెట్టదు, అది నేను నా తల్లి కూతురినని నాకు గుర్తు చేస్తుంది. నా అమ్మ జుట్టు 30 ఏళ్ల నాటికి పూర్తిగా తెల్లగా మారిపోయినా, కానీ ఆమె ఎప్పుడూ వాటికి రంగు వేసుకోలేదు. అలాగే వదిలేసింది. ఉచిత సలహాలను ఎప్పుడూ పట్టించుకోలేదు. అమ్మ ధైర్యమే శక్తినిస్తోంది’’ అని తెలిపింది. మొదట్లో కొన్ని రోజులు నేను సిగ్గు పడ్డాను. కానీ పెళ్లి మాత్రం ఇలాగే చేసుకోవాలను కున్నాఇప్పటివరకు అనుభవించిన అత్యంత అందమైన క్షణాలివే అంటూ సిగ్గుపడింది మైత్రి.
మైత్రి జొన్నల బంగారు అంచుతో ఉన్న చక్కటి ఎర్రటి చీరలో అందంగా మెరిసిపోయింది. దీనికి జతగా బంగారు జరీ వర్క్‌తో తయారు చేసిన రెడ్ బ్లౌజ్ ధరించింది. నెక్లెస్, చెవులకు ఝుంకాలు, పాపిట బిళ్ల, అరవంకీ, గాజులుతో లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా జాగ్రత్తపడింది. కాగా మైత్రి తత్వ భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి బీఏ, ఎల్‌ఎల్‌బి (ఆనర్స్), సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ నుండి బిజినెస్ లా , ఎడిఆర్‌లో మాస్టర్ ఆఫ్ లాస్‌ను అభ్యసించింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీ సలహాదారుగా పనిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment