అర్కాన్సాస్‌ పార్కులో అరుదైన వజ్రం | Arkansas state park found 6.03 carat diamond | Sakshi
Sakshi News home page

అర్కాన్సాస్‌ పార్కులో అరుదైన వజ్రం

Nov 15 2026 3:31 AM | Updated on Nov 15 2026 3:31 AM

Arkansas state park found 6.03 carat diamond

అమెరికాలోని అర్కాన్సాస్‌ రాష్ట్రం మర్‌ఫ్రీస్‌బొరోలో ఉన్న ‘క్రేటర్‌ ఆఫ్‌ డైమండ్స్‌ స్టేట్‌ పార్క్‌’కు ప్రతిరోజూ వందలాది మంది అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ జరిపే అన్వేషణలో ఎవరికి ఏ వజ్రం దొరికినా ఉచితంగా ఇంటికి తీసుకుపోవచ్చు. పార్కులోకి వెళ్లడానికి నామమాత్రపు ప్రవేశ రుసుము చెల్లిస్తే చాలు.

పార్కులో తవ్వకాలు జరపడానికి ఇంటి నుంచి ఎవరి పనిముట్లు వారే తెచ్చుకోవచ్చు. ఇంటి నుంచి పనిముట్లు తెచ్చుకోని వారి కోసం పార్కు వెలుపలే గునపాలు, పారలు వంటి పరికరాలు అద్దెకు కూడా దొరుకుతాయి. ఉదయం పార్కు తెరిచింది మొదలుకొని సాయంత్రం మూసివేసే వరకు ఔత్సాహికులు ఇక్కడ తవ్వకాలు జరుపుతూ, వజ్రాల వేట సాగిస్తూనే ఉంటారు.

ఒక్కోసారి అదృష్టవంతులకు చిన్నా చితకా వజ్రాలు దొరుకుతుంటాయి. అందరి మాదిరిగానే జాక్‌ పియరాడిన్‌ అనే పెద్దాయన కూడా ఇటీవల ఈ పార్కుకు వజ్రాల వేట కోసం వచ్చాడు. పలుగూ పారా, తట్టా బుట్టా పట్టుకుని తవ్వుతుండగా, అతగాడికి అమాంతంగా అరుదైన పసుపు వజ్రం దొరికింది. దీని బరువు 6.03 కేరట్లు. దీనికి మిలియన్‌ డాలర్లకు పైగా ధర పలకవచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement