సేంద్రియ వ్యవసాయంలో ఆచరణాత్మక ఉచిత శిక్షణ | Akshayakalpa Organic provides comprehensive guidance of free fellowship | Sakshi
Sakshi News home page

సేంద్రియ వ్యవసాయంలో ఆచరణాత్మక ఉచిత శిక్షణ

Sep 29 2026 4:29 AM | Updated on Sep 29 2026 4:29 AM

Akshayakalpa Organic provides comprehensive guidance of free fellowship

సేంద్రియ పశుపోషణ, సమీకృత సేంద్రియ వ్యవసాయంలో 15 ఏళ్ల అనుభవం గల అక్షయకల్ప ఆర్గానిక్స్‌ సంస్థ 3 నెలల ఉచిత ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. యువకులను రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా 19–27 ఏళ్ల మధ్య వయస్కులకు శిక్షణ ఇస్తారు. 

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లిలోని అక్షయకల్ప రీజెనరేటివ్‌ వ్యవసాయ పరిశోధన–అభివృద్ధి కేంద్రంలో 3 నెలల రెసిడెన్షియల్‌ ఉచిత శిక్షణ, భోజన వసతులతో పాటు స్టయిపెండ్‌ కూడా ఇస్తారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 2,500 మంది రైతులకు శిక్షణ ఇచ్చి మార్గదర్శనం చేశామని అక్షయకల్ప ప్రతినిధి డాక్టర్‌ తేజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఇతర వివరాలకు.. శిక్షణ సమన్వయకర్త సాయి వంశీరెడ్డి– 89043 96761.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement