కొత్తకారు కొన్న ఫహద్‌ ఫాసిల్‌.. ధర ఎంతో తెలుసా? | Actor Fahadh Faasil Buys Volkswagen Golf GTI | Sakshi
Sakshi News home page

Fahadh Faasil: కొత్త కారు కొన్న ఫహద్‌ ఫాసిల్‌.. ధర ఎంతో తెలుసా?

Jun 21 2025 4:00 PM | Updated on Jun 21 2025 5:36 PM

Actor Fahadh Faasil Buys Volkswagen Golf GTI

మలయాళ నటుడు, పుష్ప ఫేమ్‌ ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) కొత్త కారును కొనుగోలు చేశాడు. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTIని కొనుగోలు చేశాడు. తన కార్ల గ్యారేజ్‌లో కొత్త వెహికల్‌ వచ్చిన విషయాన్ని ఫోక్స్‌ వ్యాగన్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. వోక్స్‌వ్యాగన్ GTI భారత మార్కెట్ కోసం కేటాయించిన 150 యూనిట్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.

ఫహద్‌ ఫాసిల్‌ కొనుగోలు  చేసిన వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTI  కారు గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్ రంగులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 53 లక్షలు (ఎక్స్-షోరూమ్). పవర్-ప్యాక్డ్ 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన ఈ కారు గరిష్టంగా 265 హార్స్‌పవర్, 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది  కేవలం 5.9 సెకన్లలో 0 -100 కి.మీ./గం.కు చేరుకుంటుంది

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ GTIతో పాటు, ఫహద్ ఫాసిల్ తన గ్యారేజీలో అనేక ఇతర అన్యదేశ కార్లను కలిగి ఉన్నాడు. ఈ జాబితాలో మినీ కంట్రీమ్యాన్, లంబోర్గిని ఉరుస్, పోర్షే 911, ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఉన్నాయి. కాగా టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌మూవీ పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన  పుష్ప 2: ది రూల్‌లో భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫహద్‌ ఫాసిల్‌ విలనిజాన్ని పండించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  

Yoga విల్లులా వంగే పాలరాతి శిల్పం.. శిల్పా శెట్టి, వైరల్‌ వీడియో

Advertisement
 
Advertisement
Advertisement