ఈ డివైస్‌తో శాశ్వతంగా మొటిమలను పోగొట్టుకోవచ్చు..

Acne Light Shot Device To Remove Pimples And Scars - Sakshi

సాధారణంగా తీసుకుంటున్న ఆహారంతోనో, వయసులో వచ్చే మార్పులతోనో, నెలసరి సమయాల్లోనో.. మొటిమలు రావడం.. అవి పూర్తిగా తగ్గకుండా నల్లటి మచ్చలుగా మిగిలిపోవడం, ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం వంటివి చాలామందిలో కనిపించే సమస్యలే. వాటికి చెక్‌ పెడుతుంది చిత్రంలోని మినీ మెషిన్‌.ఈ ఎల్‌ఈడీ మెడికల్‌ డివైస్‌ (యాక్నే లైట్‌ షాట్‌).. వాడుతున్న తొలి రోజు నుంచే మెరుగైన ఫలితాలనివ్వడం  మొదలుపెడుతుంది. అంటే ట్రీట్‌మెంట్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్న మాట.

ఇది చర్మం మీద ఏర్పడే మొటిమల్ని, మచ్చల్ని, గాయాలను శాశ్వతంగా దూరం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీన్ని వినియోగించే సమయంలో చేతులతో అవసరం ఉండదు. పైగా ఈ డివైస్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. టార్గెటెడ్‌ డెలివరీ సిస్టమ్‌తో రూపొందిన ఈ మినీ మెషిన్‌.. మొటిమలు లేదా మచ్చలున్న చోట లైట్‌ థెరపీతో చర్మాన్ని మెరిపిస్తుంది.

ఇది చాలా సురక్షితమైనది. ప్రభావవంతమైనది. వేగవంతమైనది కూడా. ఈ చికిత్సతో 90 శాతం మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ఈ డివైస్‌ని వినియోగించి.. ముఖం మీదున్న రంధ్రాలను 80 శాతం వరకూ తగ్గించుకోవచ్చు. గాయాలను వాటి తాలుకు మచ్చలను 75 శాతం వరకూ నయం చేసుకోవచ్చు. దీన్ని మగవారు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కంటి పరిసరాల్లో వినియోగిస్తున్నప్పుడు.. చిత్రంలోని ప్రత్యేకమైన కళ్లజోడును పెట్టుకోవాలి. బాగుంది కదూ!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top