హోరాహోరీగా స్కూల్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా స్కూల్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు

Nov 24 2026 12:54 AM | Updated on Nov 24 2026 12:54 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న స్కూల్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. లీగ్‌ రెండో రోజు సోమవారం ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌, భాష్యం పబ్లిక్‌ స్కూల్‌ జట్లు తలపడ్డాయి.

సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌ విజయం

తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఆర్‌వీకే నిహాంత్‌, ఎలిజా ఫిన్నీ, ఎన్‌. కౌశిక్‌ చెరో 19 పరుగులు చేశారు. భాష్యం స్కూల్‌ బౌలర్లలో విక్రమ్‌ నిహాల్‌ తేజ్‌ 4 వికెట్లు తీసి రాణించాడు. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భాష్యం స్కూల్‌ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులకే పరిమితమైంది. విక్రమ్‌ నిహాల్‌ తేజ్‌ 54 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. సీఆర్‌ఆర్‌ బౌలర్లలో ఎస్‌కే లతీఫ్‌ హసన్‌ 2 వికెట్లు తీయగా, ఆర్‌వీకే నిహాంత్‌, ఎండీ సబీర్‌ పాషా పొదుపుగా బౌలింగ్‌ చేసి చెరో వికెట్‌ పడగొట్టారు. దీంతో సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అదరగొట్టిన బౌలర్‌ ఉస్మాన్‌

రెండో మ్యాచ్‌లో శ్రీ సూర్య పబ్లిక్‌ స్కూల్‌ జట్టు కేపీడీటీ స్కూల్‌ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీ సూర్య స్కూల్‌ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. బేగ్‌ అమీన్‌ 49, ఎస్‌కే ముబారక్‌ 21 పరుగులతో రాణించగా, కేపీడీటీ బౌలర్‌ నాగ చైతన్య 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కేపీడీటీ స్కూల్‌ బ్యాటర్లు తడబడ్డారు. 7.2 ఓవర్లలోనే కేవలం 45 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. బౌలర్‌ ఎండీ ఉస్మాన్‌ 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement