వీరవాసరం: యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) నివారణకు యాంటీబయాటిక్స్ వాడకంలో జాగ్రత్తలు పాటిస్తూ, శాసీ్త్రయ పద్ధతుల్లో ఆక్వా సాగు చేయాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ సూచించారు. ప్రపంచ ఏఎంఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈనెల 18 నుంచి 24 వరకు చేపడుతున్న ప్రచారంలో భాగంగా సోమవారం వీరవాసరం మండలం కొణితివాడ నౌడూరు జంక్షన్‌లోని శ్రీ పద్దాలాల్ వెంకమ్మ అమ్మవారి ఫంక్షన్ హాల్‌లో జాతీయ సుస్థిర ఆక్వాకల్చర్ కేంద్రం (నాక్సా), ఎంపీఈడీఏ ఆధ్వర్యంలో పదో విడత అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. రొయ్యల సాగులో యాంటీబయాటిక్స్‌ను అనవసరంగా వాడితే వాటి అవశేషాలు పర్యావరణం, మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కలెక్టర్ తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు మంచి ఆక్వాకల్చర్ పద్ధతులు పాటించాలన్నారు. నాక్సా సీఈఓ దైహున్ ఖోంగ్లాం, శాస్త్రవేత్త డాక్టర్ ఎ. చంద్రశేఖర్ రావు, ఎంపీఈడీఏ అధికారి ఎస్. దుర్గారావు, ఎఫ్‌డీఓ వివేక్ ఏఎంఆర్ నివారణ, ఎగుమతులు, ఆరోగ్య ప్రభావాలపై అవగాహన కల్పించారు. డాక్టర్ జి. వరలక్ష్మి, ఎస్. బాలాజీ, ఎం. విజయ్ కుమార్, 89 మంది ఆక్వా రైతులు పాల్గొన్నారు.


