చెరువులో ఈతకు వెళ్లి యువకుడి మృతి ఆగిరిపల్లి: చెరువులో ఈతకు వెళ్లి ఓ అసిస్టెంట్ లెక్చరర్ నీట మునిగి మృతి చెందిన ఘటన మండలంలోని తోటపల్లిలో జరిగింది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం బర్‌పోతులపాలెం గ్రామానికి చెందిన వీరంకి లోకేష్ (23) తోటపల్లిలోని హీల్ స్కూల్‌లో పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులతో కలిసి గ్రామంలోని బ్రహ్మయ్యలింగం చెరువుకు ఈత కొట్టేందుకు వెళ్లారు. చెరువులో లోతు ఎక్కువగా ఉండడంతో లోకేష్ నీట మునిగిపోయారు. విద్యార్థుల సమాచారంతో స్థానికులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. డీఆర్‌ఓకు శుభాకాంక్షలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి. రవీంద్రను ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌కుమార్, కార్యదర్శి ఎ.ప్రమోద్‌కుమార్, నాయకులు జి.విజయకుమార్ రాజు, కె.రవిచంద్ర, కె.స్వామి, నాజిమా, అద్దేపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.
పోస్టుమార్టం నేటికి వాయిదా జిల్లా స్కేటింగ్ క్రీడాకారుల ప్రతిభ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న పలువురు స్కేటింగ్ క్రీడాకారులు ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. కాకినాడలో నిర్వహించిన స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో వివిధ విభాగాల కింద క్రీడాకారులు పతకాలు సాధించారు. 6–8 ఏళ్ల వయో విభాగం రింక్–2 పోటీల్లో మల్ల లక్ష్మీ సృజతి బంగారు పతకం, 12–15 ఏళ్ల రోడ్–1 విభాగంలో పుచ్చల యువన్ సాయి మణికాంత్ రజత పతకం కై వసం చేసుకున్నారు. అలాగే, 10–12 ఏళ్ల గ్రూప్ రింక్ విభాగంలో ఎం. శ్రీ భువన్ కాంస్య పతకం గెలుచుకోగా, స్పెషల్ కిడ్స్ విభాగంలో దేవదాసు క్రాంతి నిహాల్ రింక్–2, రింక్–3 పోటీల్లో రెండు కాంస్య పతకాలు సాధించాడు. మరోవైపు, తణుకులో జరిగిన రోలర్ హాకీ జూనియర్ బాలుర విభాగంలో ఎన్. లిఖిల్ కాంస్య పతకం సాధించాడు. పతకాలు గెలిచిన క్రీడాకారులతో పాటు, వారి కోచ్ షేక్ ఖాసింను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ. అజీజ్, సెట్‌వెల్ సీఈఓ కేఎస్. ప్రభాకర్ ప్రత్యేకంగా అభినందించారు. వివాహిత ఆత్మహత్య?
ద్వారకాతిరుమల: మండలంలోని ఎం.నాగులపల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన చవటపల్లి రవితేజ (24) మృతదేహానికి సోమవారం నిర్వహించాల్సిన పోస్టుమార్టం వాయిదా పడింది. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయగా, చట్టపరమైన ప్రక్రియలో జరిగిన ఆలస్యం కారణంగా వాయిదా పడింది. వైద్యులు మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన బెడదనూరులో వివాహిత మడకం కీర్తన (19) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై చెన్నారావు తెలిపిన వివరాల ప్రకారం గుంజవరం గ్రామానికి చెందిన కీర్తన (19)కు కె.వెంకటేశ్వరరావుతో 8 నెలల క్రితం పెళ్లయింది. ఆమె మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.