ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పెదవేగి గురుకుల పాఠశాలలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. ఈ పోటీల్లో వి. రంజని 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలతో పాటు 4 ్ఠ100, 4 ్ఠ400 మీటర్ల రిలే విభాగాల్లోనూ సత్తా చాటి మొత్తం నాలుగు బంగారు పతకాలను కై వసం చేసుకుంది. వీటితో పాటు పోటీల్లో ఉత్తమ అథ్లెట్‌గానూ నిలిచింది. అలాగే, 4 ్ఠ400 మీటర్ల రిలే విభాగంలో దొరబాబు, సత్యమణికంఠ కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. పతకాలు సాధించి జిల్లాకు పేరు తెచ్చిన విద్యార్థులను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ అజీజ్ ప్రత్యేకంగా అభినందించారు.
అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారుల జయకేతనం
Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM
అథ్లెటిక్స్ పోటీల్లో క్రీడాకారుల జయకేతనం
కొండ చిలువ హతం భీమడోలు: పొలసానిపల్లి శివారు ఆంజనేయనగరం పోలవరం కాల్వ గట్టుపై సోమవారం రాత్రి 8 అడుగుల భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. స్థానిక రైతు గురజాల వెంకటేశ్వరరావు పశువులశాల సమీపంలో కనిపించిన దీనిని, పశువులకు ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనతో స్థానికులు హతమార్చారు. జనావాసాల వద్ద వన్యప్రాణుల సంచారంపై అధికారులు తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మరోవైపు, భీమడోలులోని దిగుడుపాటి దిబ్బ జగనన్న కాలనీలో రాత్రి వేళల్లో మరో భారీ కొండచిలువ సంచరిస్తుండటంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి దానిని పట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement


