విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి దుర్మరణం

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి దుర్మరణం ఫెన్సింగ్‌లో ‘పశ్చిమ’ హవా

నిడమర్రు: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన నిడమర్రు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై లంకా రాజేష్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఇంటి రామలక్ష్మి చెరువును, అదే గ్రామానికి చెందిన ఆక్వా రైతు వగ్వాల శ్రీను లీజుకు తీసుకుని రొయ్యల సాగు చేస్తున్నాడు. వెంకటాపురం వీధికి చెందిన మాదాసు శ్రీను (38) బుధవారం ఉదయం ఆ చెరువులో నీరు తోడే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో 11 గంటల సమయంలో అక్కడి 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మోటారుకు కనెక్షన్‌ ఇచ్చిన త్రీఫేస్‌ సర్వీస్‌ వైరు అతడి కుడి చేతి చూపుడు వేలికి తగిలింది. దీంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురైన శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య మాదాసు సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడలో 13వ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీనియర్‌ బాలుర, బాలికల ఫెన్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ 2026–27 పోటీలు నిర్వహించారు. కాకినాడలోని లక్ష్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

విజేతలు వీరే..

పురుషుల ఫాయిల్‌ విభాగంలో పశ్చిమగోదావరి బంగారు, తూర్పుగోదావరి రజత, ప్రకాశం, కర్నూలు జట్టులు పతకాలు సాధించాయి. మహిళల ఫాయిల్‌ విభాగంలో పశ్చిమగోదావరి బంగారు, తూర్పుగోదావరి రజత, విజయనగరం, గుంటూరు కాంస్య పతకాలు సాధించాయి. ఏపీ పురుషుల విభాగంలో కర్నూలు బంగారు, విశాఖ రజత, పశ్చిమగోదావరి, విజయనగరం కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement