తొలి అంకం సమాప్తం | - | Sakshi
Sakshi News home page

తొలి అంకం సమాప్తం

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

న్యూస్‌రీల్‌

తొలి విడత పంచాయతీల్లో..

రెండో విడత ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు

మంగళవారం శ్రీ 17 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల నిమిత్తం నామినేషన్ల సమర్పణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. చైర్‌పర్సన్‌ పదవికి 12 మంది, 23 వార్డు మెంబర్ల పదవులకు 125 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే జిల్లాలోని 177 పంచాయతీల్లో జరగనున్న తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగు తోంది. ఇక్కడ మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. కాగా 177 పంచాయతీలకు ఇప్పటివరకు 592 మంది సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్‌ దాఖలు చేయగా, 1,896 వార్డులకుగాను 2,792 మంది నామినేషన్లు సమర్పించారు.

26న పోలింగ్‌

చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 26న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 19 వరకు గడువు ఉన్న నేపథ్యంలో ఉపసంహరణ అనంతరం బరిలో ఎంత మంది అభ్యర్థులు నిలిచేది తేలనుంది. చైర్‌పర్సన్‌ స్థానాన్ని ఎస్సీ (మహిళ)కు కేటాయించారు. ఈ స్థానానికి మొత్తం 12 నామినేషన్లు దాఖలుకాగా 23 వార్డులకుగాను 125 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్‌పర్సన్‌ పదవికి దాఖలైన 12 నామినేషన్లలో వైఎస్సాసీపీ నుంచి ఏడుగురు, తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు, కాంగ్రెస్‌ నుంచి ఒకరు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. 23 కౌన్సిలర్‌ వార్డులకు 125 నామినేషన్లు దాఖలు కాగా వైఎస్సార్‌సీపీ నుంచి 49, తెలుగుదేశం పార్టీ నుంచి 51, జనసేన నుంచి 10, స్వతంత్ర అభ్యర్థులు 8, సీపీఐ నుంచి 2, సీపీఎం నుంచి 2, కాంగ్రెస్‌ నుంచి 2, బీజేపీ నుంచి 1 దాఖలయ్యాయి.

జిల్లాలో తొలి విడతలో 11 మండలాల్లోని 177 గ్రామ పంచాయతీలకు, 1,896 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 15న ప్రారంభమైన నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగియనుంది. తొలిరోజు సర్పంచ్‌ పదవులకు 44 నామినేషన్లు, వార్డు మెంబర్ల స్థానాలకు 140 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు సోమవారం సర్పంచ్‌ పదవులకు 548, వార్డు మెంబర్‌ స్థానాలకు 2,652 నామినేషన్లు దాఖలయ్యాయి. 18న నామినేషన్ల పరిశీలన, 19న తిరస్కరణ చేపట్టనున్నారు. అనంతరం 20న అప్పీళ్ల పరిష్కారానికి గడువు, 21న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది, అదే రోజు తుది జాబితాను ప్రకటించనున్నారు. 26న మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ఎన్నికల నిమిత్తం 1,953 పోలింగ్‌ స్టేషన్లల్లో విధుల నిర్వహణకు 1,037 మంది సిబ్బందిని అధికారులు నియమించారు. మొత్తంగా 4,57,329 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ముగిసిన నగర పంచాయతీ నామినేషన్ల పర్వం

చింతలపూడి చైర్‌పర్సన్‌ పదవికి 12..

23 వార్డు స్థానాలకు 125 నామినేషన్లు

తొలి విడత 177 పంచాయతీల్లో ఎన్నికలు

పంచాయతీల్లో నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

ఏఐ సృష్టించిన చిత్రం

రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. జిల్లాలోని 8 మండలాల్లో 194 పంచాయతీలు, 1,972 వార్డుల్లో ఈనెల 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. భీమడోలు, కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నిడమర్రు, ఉంగుటూరు, ద్వారకాతిరుమల మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు 2,024 పోలింగ్‌ స్టేషన్లలో 4,19,290 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల నిమిత్తం ఈనెల 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన, 22న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇస్తారు. 23న అప్పీళ్లను పరిష్కారించి, 24న ఉప సంహరణకు అవకాశం ఇస్తారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను అధికారులు విడుదల చేసి, 29న ఉదయం పోలింగ్‌ నిర్వహించి, మ ధ్యాహ్నం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement