బతుకు పోరు | - | Sakshi
Sakshi News home page

బతుకు పోరు

Nov 14 2026 12:47 AM | Updated on Nov 14 2026 12:47 AM

ఎందరో మృత్యువాత వంతెన నిర్మించాలి చదువు కోసం తప్పడం లేదు

అంతరిక్షం వైపు అడుగులు.. జెట్‌ స్పీడ్‌ ట్రైన్లు.. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో సులభతరమవుతున్న ఈ రోజుల్లో చిన్న కాలువపై వంతెన నిర్మాణానికి దశాబ్దాల ఆలస్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
ఏరు.. దాటితేనే

● కోమటిలంక గ్రామానికి సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో ఎందరో గ్రామస్తులు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి.

● కడిమి వెంకన్నను ముంగీస కరవగా.. సకాలంలో వైద్యం అందక కన్నుమూశాడు.

● యాళ్ల రూతమ్మకు పురిటినొప్పులు రాగా కష్టం మీద ఊరు దాటించారు. రోడ్డుపై ప్రసవం కావడంతో శిశువు మృతి చెందింది.

● సావు సత్యవతికి గుండెపోటు రాగా కై కలూరు ఆస్పత్రికి తరలించారు. ఆలస్యం కావడంతో అప్పటికే ఆమె మృతిచెందింది.

● నెండ్రు లక్ష్మమ్మకూ గుండెపోటు రాగా సకాలంలో వైద్యం అందక మరణించింది.

● చిన్నమ్మ కాలుజారి పడగా ఆస్పత్రికి చేరక ముందే కన్నుమూసింది.

● చిన్నం మనిషా అనే యువతి బట్టలు ఉతుకుతూ నాగరాజు ఏరులో పడిపోయింది. ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించేలోపు మరణించింది.

చుట్టూ నీటితో కోమటిలంక గ్రామం

దేశంలో అనేక అటవీ ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తున్నారు. దశాబ్దాలు గా వంతెన కోసం గ్రామస్తులంతా పోరాడుతున్నాం. ఎన్నో ఇబ్బందులు మధ్య పక్షుల దొడ్డి గట్టుపై రబ్బిస్‌ వేయగలిగాం. దీంతో వర్షాలు లేని సమయంలో నేరుగా గ్రామానికి చేరుతున్నాం. ప్రభుత్వాలు వంతెన నిర్మాణం చేపట్టాలి.

– తేరా దేవసహాయం, గ్రామస్తుడు

తుపాన్ల సమయంలో నాగరాజు ఏరు పొంగుతోంది. అప్పుడు పడవలపై ప్రయాణిస్తున్నాం. చదువు కోసం తప్పడం లేదు. ఏరు దగ్గర నుంచి నేను చదువుతున్న కై కలూరు హైస్కూల్‌ రెండు కిలోమీటర్ల దూరం ఉంది. భారీ వరదల సమయంలో పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. మా గ్రామానికి వంతెన నిర్మించండి.

– సరెళ్ల ఐశ్వర్య, 10వ తరగతి విద్యార్థిని

కై కలూరు: దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్‌ మండలం కోమటిలంక గ్రామం ద్వీపంలా నీటిలో తేలియాడుతున్నట్టు కనిపిస్తోంది. గ్రామ జ నాభా 1,123 కాగా సుమారు 300కు పైగా కుటుంబాలు ఉన్నాయి. అధిక శాతం ప్రజలు కూలీ పనులు, చేపల వేటపై ఆధారపడ్డారు. ఏటా భారీ వర్షాలు, తుపాన్లకు నాగరాజు ఏరు పొంగటంతో ప్రమాదకర పడవ ప్రయాణమే వీరికి దిక్కవుతోంది.

ఉధృతంగా వాగు

కోమటిలంకవాసులు నిత్యం నాగరాజు ఏరు దాటి ఆటపాక పక్షుల విహార కేంద్రం గట్టు నుంచి కై కలూరు చేరుకుంటారు. సాధారణ రోజుల్లో ఏరు మధ్యలో తూములు ఏర్పాటు చేసి తాత్కాలిక రహదారిపై గ్రామస్తులు చేరుకుంటున్నారు. ఈ దారిపై నేరుగా వాహనాల ద్వారా ప్రయాణించవచ్చు. అయితే గతనెల 24న అర్నబ్‌, 31న మురసు తుపాన్ల వల్ల ఎగువ నుంచి వచ్చే నీటితో నాగురాజు ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాహనాలను ఆటపాక గట్టుపై నిలిపి రోజూ పడవలపై దాటి రాకపోకలు సాగిస్తున్నారు.

భద్రత తడ‘బోటు’

గతంలో గ్రామంలో ఐసీఎం సంస్థ 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాల నిర్వహించింది. ఇటీవల ఈ పాఠశాల రద్దయ్యింది. దీంతో విద్యార్థులంతా ఆటపాక, కై కలూరు ప్రాంతాల్లో చదువుకోవాల్సి వసోంతది. ఇలా రోజు సుమారు 200 మంది విద్యార్థులు చదువు కోసం వస్తున్నారు. అలాగే పనుల నిమిత్తం ప్రజలు వస్తుంటారు. నాగరాజు ఏరు నుంచి ఆటపాక జాతీయ రహదారి వరకు కిలోమీటరు, అక్కడ నుంచి ప్రభుత్వ పాఠశాల మరో కిలో మీటరు ఉంది. తుపాన్ల కారణంగా ప్రజలంతా 20 రోజులుగా పడవలపై దాటుతున్నారు. ఇదిలా ఉండగా మరో తుపాను హెచ్చరికలతో వీరంతా వణికిపోతున్నారు.

వంతెన కల నెరవేరేనా?

కోమటిలంక నుంచి ఆటపాక పక్షుల కేంద్ర గట్టు వరకు వంతెన నిర్మాణం గ్రామస్తులకు తీరని కలగా మారింది. దాదాపు 20 ఏళ్లుగా గ్రామస్తులు వంతెన కోసం ప్రయత్నిస్తున్నారు.

ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన పథకం, ఫేజ్‌ త్రీలో రూ.86 లక్షలతో టీడీపీ ప్రభుత్వం 2004 శంకుస్థాపన చేయగా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రధానంగా నాగరాజు ఏరు కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉంది. అలాగే ఆటపాక పక్షుల కేంద్రం గట్టు ప్రజల నడకదారిగా మారింది. కోమటిలంకలో అక్రమ చేపల చెరువులకు మేతలు, చేపల పట్టుబడులకు భారీ వాహనాలు ఈ రోడ్డుపై నుంచి వెళుతున్నాయి. దీంతో అటవీశాఖ వంతెన నిర్మాణ అనుమతులను నిరాకరిస్తోందనే ప్రచారం ఉంది.

సమస్యలు కనపడవా?

కోమటిలంకవాసులకు తుపాన్ల దెబ్బ

20 రోజులుగా పడవలపై ప్రమాదకర ప్రయాణం

కలగా మారిన వంతెన నిర్మాణం

గ్రామంలో కనీసం పాఠశాల కూడా లేదు

మరో తుపాను హెచ్చరికలతో గ్రామస్తుల భయాందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement