సోమేశ్వరా.. శుభంకర | - | Sakshi
Sakshi News home page

సోమేశ్వరా.. శుభంకర

Nov 14 2026 12:47 AM | Updated on Nov 14 2026 12:47 AM

సోమేశ్వరా.. శుభంకర ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలు పెంపు సైబర్‌ నేరాలపై అప్రమత్తం ముంపు బాధితులకు నిత్యావసరాల అందజేత

భీమవరం(ప్రకాశం చౌక్‌) : పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడిలోని ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో కార్తీక మాసం, నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక పంచామృత రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, రుద్రహోమం, జ్యోతిర్లింగార్చన, శాంతికల్యాణ, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. నిత్యాన్నదాన ప్రసాద వితరకు పి.వెంకటేశ్వరరావు (భీమవరం) రూ.20 వేలు అందించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.

ఏలూరు (టూటౌన్‌): ఏకగ్రీవంగా ఎన్నికై న పంచాయతీలకు అందించే ప్రోత్సాహక మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్‌, వార్డు సభ్యులున్న పంచాయతీలకు ఇది వర్తిస్తుందన్నారు. జనాభా వారీగా 5 వేలలోపు ఉంటే రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేలు ఉంటే రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉంటే రూ.50 లక్షల ప్రోత్సాహకం అందిస్తారన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన అనంతరం ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ముందుగా గ్రామ పంచాయతీ అర్హతను అధికారులు ధ్రువీకరించాలన్నారు. ప్రోత్సాహక మొత్తాన్ని నిర్దేశించిన ఆర్థిక, అకౌంటింగ్‌, ఆడిట్‌ విధానాలకు లోబడి, సంబంధిత పంచాయతీలు ఆమోదించిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పనులకు మాత్రమే వినియోగించాలన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పద వీ కాలంలో పెంచిన ప్రోత్సాహకాన్ని దశల వారీగా విడుదల చేస్తారన్నారు.

పెదపాడు: సెల్‌ఫోన్లను అవసరాలకు మాత్రమే వాడాలని, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి తెలి పారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వట్లూరు గురుకుల పాఠశాలలో శుక్రవారం ఫోక్సో, బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టం ప్రకారం నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తారన్నారు. సమస్యలు ఎదుర్కొనే కంటే నివారణ మార్గాలను పాటించాలని, సమస్య ఏదైనా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, న్యాయసేవాధికార సంస్థలను సంప్రదించవచ్చని సూచించా రు. బాధితులకు పరిహారం పొందే అవకాశం ఉందని, విద్యార్థులు మారుతున్న చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండటం అవసరమన్నారు. అలాగే మానవ అక్రమ రవాణా, సురక్షితమైన స్పర్శ, భద్రత తదితర చట్టాలపై అవగాహన కలిగించారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ డి.ఝాన్సీ పారాలీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

ఆకివీడు: మండలంలో తుపాను, వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని తహసీల్దార్‌ దర్శి వంశీ తెలిపారు. ‘నల్లగా మారి.. దుర్గంధంతో నిండి..’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురించిన కథనానికి ఆయన స్పందించి ఆయా ప్రాంతాల్లో బాధితుల గుర్తింపు చర్యల్ని చేపట్టారు. బాధితులు 532 మందికి నిత్యావసర సరుకులు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement