కై కలూరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమ్మకంతోనే టీడీపీని వీడి పలువురు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కై కలూరు పార్టీ కార్యాలయంలో కై కలూరు మండలం పల్లెవాడకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు బుంగా బాబురావు 150తో కలిసి డీఎన్నార్ సమక్షంలో శుక్రవారం పార్టీలో చేరారు. అందరికీ పార్టీ కండువాలు కప్పి వారిని డీఎన్నార్ ఆహ్వానించారు. డీఎన్నార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గం మొత్తం ప్రజలు వైఎస్సార్‌సీపీని ఆదరించారన్నారు. అందుకే కూటమికి మెజార్టీ తగ్గిందన్నారు. నాయకులు ముంగర నరసింహారావు, జయమంగళ కాసులు, బంటుమిల్లి సాధు కొండయ్య, సమయం అంజి, చింతల జేమ్స్, కోటే విజయరాజు, దాకరపు అర్జున్, అల్లూరి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


