ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

టి.నరసాపురం: చంద్రబాబు ప్రభుత్వం ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిందని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. మండలంలోని బండివారిగూడెం, అప్పలరాజుగూడెం, మక్కినవారిగూడెం పంచాయతీలలో శనివారం ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండివారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థి తాళ్ళ రాంబాబు, అప్పలరాజుగూడెం ఎంపీటీసీ అభ్యర్థి గెల్ల సుచరిత, మక్కినవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థి పెనుబోయిన కుమారి, టి.నరసాపురం జెడ్పీటీసీ అభ్యర్థి గుండె హరీషలకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

పచ్చ చొక్కాలకే పథకాలు

ఆయా గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఆసుపత్రులకు బిల్లులు చెల్లించని కారణంగా సరైన వైద్యం అందక, ఆపరేషన్లు జరగక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు గడపగడపకూ చేరాయని, ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు లబ్ధి చేకూరిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, కేవలం పచ్చ చొక్కాలకే పథకాలు పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా బండివారిగూడెంలో 10 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బండివారిగూడెంలో జరిగిన ప్రచారంలో బాలరాజుతో పాటు దాసరి రాంబాబు, దాసరి కాశీ వరప్రసాద్‌, దేవానందం, ముత్తంశెట్టి లక్ష్మణరావు, చింతం ఆనందరావు, గుర్రం నాగేశ్వరరావు, గంగుల సుబ్బారావు పాల్గొన్నారు. అలాగే మక్కినవారిగూడెంలో పిన్నమనేని చక్రవర్తి, మందలపు మూర్తి, అప్పలరాజుగూడెంలో మాజీ సర్పంచ్‌ జల్లా మూర్తి తదితర వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement