హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం | - | Sakshi
Sakshi News home page

హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

తణుకు అర్బన్‌: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక మహిళ చేతిలో వ్యక్తి హత్యకు గురికావడంతో రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తణుకు మండలం కొమరవరం గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగగా.. పాల నాగరాజు (44) తణుకులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాల నాగరాజు, పాల శిరీష ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటున్నారు. నాగరాజు భార్య మణి, శిరీష భర్త దుర్గాప్రసాద్‌ ఇద్దరూ ఉపాధి నిమిత్తం మస్కట్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో శిరీష, నాగరాజు చనువుగా ఉంటున్న వ్యవహారం బయటకు పొక్కడంతో ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీనిలో భాగంగా శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది. ఆగ్రహంతో శిరీష.. నాగరాజు ఇంటిలోకి చొరబడి సామాగ్రిని ధ్వంసం చేసింది. అనంతరం రోడ్డుపై ఉన్న నాగరాజు వద్దకు వెళ్లి చాకుతో దాడి చేయడంతో మణికట్టు భాగంలో తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం తణుకులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం నాగరాజు మృతి చెందాడు. ఇద్దరి మధ్య ఉన్న చనువుతో పాటు, ఇరు కుటుంబాల మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితురాలు శిరీష గతంలోనూ ఇదే తరహాలో ఒక బంధువుపై చాకుతో దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు చెబుతున్నారు. తణుకు రూరల్‌ ఎస్సై నాళం శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నాగరాజు ఆటో నడుపుతూ, పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు కుమారుడు లీలాసాయి దుర్గాప్రసన్నకుమార్‌, కుమార్తె అక్షయరాణి ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం నాగరాజు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో ఘర్షణ వాతావరణం

పోస్టుమార్టం నిమిత్తం నాగరాజు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా, మృతుడి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. నిందితురాలు, మృతుడు ఒకే బంధువర్గానికి చెందినవారు కావడంతో.. ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అంతేకాకుండా శిరీషను తమకు అప్పగించాలంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు ఆసుపత్రి ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న రూరల్‌ సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, పట్టణ సీఐ జేవీ రమణ అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

చాకుతో దాడి చేసిన మహిళ.. వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement