తణుకు అర్బన్: ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పిన కారు డివైడర్‌పైకి దూసుకెళ్లిన ఘటన తణుకు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళతోపాటు మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విజయవాడకు చెందిన విద్యుత్ శాఖ ఇంజనీరు కుటుంబ సభ్యులు.. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వాడపల్లికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు తణుకు సమీపంలోని పాత టోల్‌గేట్ ప్రాంతానికి చేరుకోగానే, ఎదురుగా రాంగ్‌రూట్‌లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారు డివైడర్ ఎక్కి అక్కడే ఉన్న ఇనుప స్తంభాన్ని ఢీకొనడంతో ఆగిపోయిందని, దీనివల్ల పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. లేనిపక్షంలో.. పెరవలి వైపు నుంచి తణుకు వచ్చే వాహనాలపైకి కారు దూసుకెళ్లి ఉండేదని, అప్పుడు మరింత ప్రాణనష్టం జరిగేదని వారు పేర్కొన్నారు.


