ఏలూరు టౌన్: ఏలూరు సత్రంపాడులోని ఎన్‌టీఆర్ విగ్రహం ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒక బాలుడు ఒంటరిగా తిరుగుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవటంతో స్థానికులు ఏలూరు త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై రాంబాబు తక్షణమే స్పందించి బాలుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ మహిళా పోలీసుల సహకారంతో బాలుడి తల్లిదండ్రుల వివరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టారు. పోలీసుల కృషితో బాలుడి తల్లిదండ్రులను గుర్తించి, చిన్నారిని వారి తల్లికి సురక్షితంగా అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా అప్పగించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.


