పారా ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పారా ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

పారా ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): 2028లో అమెరికాలో జరిగే పారా ఒలింపిక్స్‌లో పతకమే తన లక్ష్యమని పారా స్విమ్మర్‌ బుడిగిన రవి కార్తీక్‌ అన్నారు. జపాన్‌ లో జరిగిన పారా ఆసియా గేమ్స్‌లో రెండు రజత, ఒక క్యాంస పతకం సాధించిన కార్తీక్‌ను శుక్రవారం స్థానిక చొదిమెళ్లలో సత్కరించారు. ఈ సందర్భంగా కార్తీక్‌ మాట్లాడుతూ 2027లో మెక్సికోలో జరిగే ప్ర పంచ చాంపియన్‌షిప్‌లో కొత్త రికార్డులు లక్ష్యంగా సాధన చేస్తున్నానన్నారు. ఇందుకోసం అత్యుత్తమ శిక్షణ తీసుకోవాలని, ఈ మేరకు ప్రభుత్వం భరోసా అందించాలని కోరారు. కార్తీక్‌ తండ్రి, న్యాయవాది నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ కార్తీక్‌ 2021 నుంచి ఇప్పటివరకు 6 నేషనల్స్‌లో 3 చొప్పున 18 బంగారు పతకాలను గెలుచుకున్నాని దేశంలోనే పారా స్విమ్మింగ్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడన్నారు. 2025 డిసెంబర్‌లో దుబాయ్‌లో జరిగిన యూత్‌ ఏషియన్‌ పారా గేమ్స్‌లో మూడు బంగారు, మూ డు రజత పతకాలు సాధించి దేశానికి ఎక్కువ పతకాలు సాధించిన ఏకై క అథ్లెట్‌గా నిలిచాడన్నారు. ముందుగా ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి నగరానికి వచ్చిన కార్తీక్‌కు చొదిమెళ్లవాసులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement